Ram Charan : సుకుమార్‌కు ఏడాది పాటు డేట్స్ ఇచ్చేసిన చరణ్.!?
పెద్ది సినిమా బిజీలో ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan).
Gossip Garage Sukumar Movie with Ram Charan
పెద్ది సినిమా బిజీలో ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్. ఈ నెల 30న మూవీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చికిరి చికిరి సాంగ్ దుమ్ములేపుతోంది. త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడట రామ్‌చరణ్. ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్‌తో ఓ సినిమా చేయబోతున్నాడట చెర్రీ.
ఇప్పటికే రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఈ కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం సుకుమార్‌కు ఒక ఏడాది పాటు తన డేట్స్ ఇచ్చేశారట రామ్‌చరణ్. సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండబోతుందని, చరణ్ పాత్ర ఇప్పటివరకు ఏ సినిమాలో చేయని విధంగా కొత్తగా ఉంటుందని అంటున్నారు.
Vijay-Rashmika honeymoon photos : విజయ్-రష్మిక హనీమూన్ ఫోటోలు..
సుక్కు, చరణ్ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారని, టెక్నికల్‌గా కూడా హాలీవుడ్ స్టాండర్డ్స్‌ను టార్గెట్ చేస్తున్నారని టాక్. సుకుమార్ తన స్టైల్‌కు తగ్గట్టుగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ డ్రామాను మిక్స్ చేయబోతున్నాడట. రామ్‌చరణ్ కూడా ఈ ప్రాజెక్ట్‌ను చాలా సీరియస్‌గా తీసుకుని, తన ఇతర కమిట్మెంట్స్ను సర్దుబాటు చేసుకుంటున్నాడట. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఈ గాసిప్ మాత్రం మెగా ఫ్యాన్స్‌లో ఎగ్జైట్మెంట్ను పెంచేస్తోంది.
