Gulshan Devaiah: సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ నటుడు.. నంబర్ ఉంది కానీ..
నటి సాయిపల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భానుమతి సింగిల్ పీస్ అంటూ తెలుగు కుర్రాళ్ల మనసులు దోచేసింది అమ్మడు. సాయి పల్లవి గురించి బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య(Gulshan Devaiah) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Sai Pallavi-Gulshan Devaiah
Sai Pallavi-Gulshan Devaiah: నటి సాయిపల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భానుమతి సింగిల్ పీస్ అంటూ తెలుగు కుర్రాళ్ల మనసులు దోచేసింది అమ్మడు. అందంతో పాటు అభినయం ఆమె సొంతం. ఆమె చేసే డ్యాన్సులు చూసేందుకే కొందరు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారు అంటే అతిశయోక్తి కాదేమో. తెలుగుతో పాటు పలు భాషల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమె నటనకి సెలబ్రెటీలు సైతం ఫిదా అవుతుంటారు.
సాయి పల్లవి గురించి బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య(Gulshan Devaiah) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాయి పల్లవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె తన క్రష్ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు గుల్షన్. ఆమె ఫోన్ నంబర్ తన వద్ద ఉన్నప్పటికి ఈ విషయాన్ని ఆమెతో చెప్పే ధైర్యం మాత్రం చేయలేకపోయాడట. ఆమెతో నటించే అవకాశం వస్తే అదే తన అదృష్టంగా బావిస్తానంటూ ఆమెపై తనకు ఉన్న ఇష్టాన్ని బయటపట్టేశాడు.
Rana Daggubati : రానా ‘మానాడు’ రీమేక్ కన్‌ఫార్మ్.. కానీ తెలుగులో కాదు!
‘సాయి పల్లవి అద్భుతమైన నటి, డ్యాన్సర్. చాలా కాలం నుంచి ఆమెపై ఇష్టం ఉంది. ఆమె నటించిన సినిమాలు అన్నింటిని చూస్తాను. ఆమె అద్భుతమైన డ్యాన్సర్. ఆమె నాకు క్రష్ మాత్రమే. అంతకు మించి ఏమీ లేదని అనుకుంటున్నా. కొన్ని సార్లు ఆమె పట్ల ఇన్‌ఫాచ్యువేషన్‌కు లోనయ్యా. ఆమె ఫోన్ నంబర్ నా వద్ద ఉంది. ఆమె వద్దకు వెళ్లి ఈ విషయం చెప్పే ధైర్యం ఎప్పుడు చేయలేదు.’ అని గుల్షన్ దేవయ్య తెలిపాడు.
సాయి పల్లవితో కలిసి పని చేసే అవకాశం ఏదో ఒక రోజు వస్తుందని అనుకుంటున్నట్లు చెప్పాడు. అది తనకు చాలు అని, తాను ఆనందంగా ఉండడానికి అది సరిపోతుందన్నాడు. ఇంకేం అవసరం లేదన్నాడు. మిగతా సంగతి తనకు తెలియని, ఒక వేళ మిగిలినది జరగపోయినా ఏం చేయలేమని అంటూ తన మనసులో ఉన్న మాటను బయట పెట్టాడు గుల్షన్. ప్రస్తుతం అతడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాఫిక్‌గా మారాయి. దీనిపై సాయి పల్లవి స్పందిస్తుందో లేదో చూడాల్సిందే.
Back Door : ఓటీటీలో ఆకట్టుకుంటోన్న పూర్ణ ‘బ్యాక్ డోర్’.. రెండే రెండు పాత్రలతో!
‘రామ్ లీలా’, ‘బ్లర్’, ‘హంటర్‌ర్’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గుల్షన్ దేవయ్య. ఇటీవల ఆయన నటించిన చిత్రం ‘8 AM మెట్రో’. సయామీ ఖేర్ ఈ చిత్రంలో హీరోయిన్.