Hari Hara Veera Mallu: విజయవాడలో హరిహర వీరమల్లు సినిమా ఫీవర్.. థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ రచ్చ రచ్చ..
సాధారణంగా సంక్రాంతి జనవరిలో వస్తుంది, పవన్ కల్యాణ్ అభిమానులకు మాత్రం ఈరోజే సంక్రాంతి వచ్చిందన్నారు.

Hari Hara Veera Mallu: విజయవాడలో హరిహర వీరమల్లు సినిమా హంగామా స్టార్ట్ అయిపోయింది. పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్నారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ సినిమా థియేటర్ లోకి వస్తుండటంతో అభిమానులు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఒకపక్క డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోపక్క సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు పవన్ కల్యాణ్. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.
Also Read: ఇది కదా పవర్ స్టార్ మేనియా అంటే.. ప్రీమియర్స్ తోనే రికార్డ్ కలెక్షన్స్.. ట్రెండింగ్ లో బుకింగ్స్..
సాధారణంగా సంక్రాంతి జనవరిలో వస్తుంది, పవన్ కల్యాణ్ అభిమానులకు మాత్రం ఈరోజే సంక్రాంతి వచ్చిందన్నారు. థియేటర్ వద్ద అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. పవన్ కల్యాణ్, హరిహర వీరమల్లు కటౌట్లతో హంగామా చేస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయమన్నారు ఫ్యాన్స్. రాత్రి 9.30 తర్వాత విజయవాడలో అన్ని థియేటర్లలో ప్రీమియర్ షో లు పడనున్నాయి.
ఇప్పటికే టికెట్లు బుక్కైపోయాయి. అలంకార్ సెంటర్ దగ్గర పవన్ అభిమానుల కోలాహలం నెలకొంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చారు. రాత్రి 9.30కి అన్ని చోట్ల సినిమా విడుదల కానుంది. పవన్ కల్యాణ్ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.