Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ తాండవం.. 24 గంట‌ల్లో ఎన్ని మిలియ‌న్ల వ్యూస్ సాధించిందో తెలుసా? ఇది జ‌స్ట్ రికార్డు మాత్ర‌మే కాదు..

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ట్రైల‌ర్‌కు అదిరిపోయే స్పంద‌న వ‌స్తోంది.

Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ తాండవం.. 24 గంట‌ల్లో ఎన్ని మిలియ‌న్ల వ్యూస్ సాధించిందో తెలుసా? ఇది జ‌స్ట్ రికార్డు మాత్ర‌మే కాదు..

Hari Hara Veera Mallu Trailer in 24 hours with 48+ million views

Updated On : July 4, 2025 / 11:58 AM IST

ప‌వర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్‌ న‌టిస్తున్న చిత్రం ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’. పీరియాడిక్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూలై 24న‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా గురువారం ట్రైల‌ర్ ను విడుద‌ల చేసింది.

కాగా.. ఈ ట్రైల‌ర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్ కేవ‌లం 24 గంట‌ల్లోనే 48 మిలియ‌న్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుని ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాదండోయ్‌.. ఈ చిత్రం అన్ని భాష‌ల్లో 24 గంట‌ల్లో 61.7 మిలియ‌న్‌కి పైగా వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. ఇది జ‌స్ట్ రికార్డు మాత్ర‌మే కాదు.. త‌దుప‌రి కొల్ల‌గొట్ట‌బోయే వాటికి ఇది వార్నింగ్ అంటూ రాసుకొచ్చింది.

3BHK Twitter Review : సిద్దార్థ్ 3BHK ట్విట‌ర్ రివ్యూ..

ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తోండ‌గా బాబీ డియోల్‌, అనుప‌మ్ ఖేర్‌, స‌త్య‌రాజ్ లు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలోని కొంత భాగాన్ని క్రిష్ తెర‌కెక్కించారు. అయితే.. కొన్నికార‌ణాల వ‌ల్ల ఆయ‌న త‌ప్పుకోగా నిర్మాత ర‌త్నం కుమారుడు జ్యోతి కృష్ణ మిగిలిన చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.