Hari Hara VeeraMallu : ‘హరి హర వీరమల్లు’ నిర్మాతకు అస్వస్థత.. క్లారిటీ ఇచ్చిన సోదరుడు..
హరి హర వీరమల్లు నిర్మాత ఎఎం రత్నం అస్వస్థతకు గురైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

Hari Hara Veeramallu producer falling unconscious here is the clarity
హరి హర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం అస్వస్థతకు గురైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన స్పృహ తప్పి పడిపోయారని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనేది సదరు వార్తల సారాంశం. మూవీ రిలీజ్ షెడ్యూల్ టెన్సన్స్ కారణంగా నిర్మాత స్వస్థతకు గురి అయ్యారనే టాక్ వినిపించింది. వీటిపై ఆయన సోదరుడు, నిర్మాత దయాకర్ రావు స్పష్టత ఇచ్చారు. వాటిని నమ్మెద్దని విజ్ఞప్తి చేశారు.
‘అన్నయ్య స్పృహ కోల్పోయాడని వస్తున్న పుకార్లను నమ్మవద్దు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. దయచేసి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా ఉండండి.’ అని దయాకర్ రావు ట్వీట్ చేశారు.
Karate Kid: Legends : ‘కరాటే కిడ్ – లెజెండ్స్’ మూవీ రివ్యూ.. జాకీచాన్ సినిమా ఎలా ఉందంటే..
Don’t believe the rumors about Annayya @AMRathnamOfl falling unconscious. He is perfectly healthy and doing well. Please avoid spreading misinformation.
— A Dayakar Rao (@ADayakarRao2) May 30, 2025
హరి హర వీరమల్లు విషయానికి వస్తే.. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా పవన్ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసినట్లుగా చిత్ర బృందం తెలిపింది. పవన్ బిజీ షెడ్యూల్ కారంగా రాత్రి 10 గంటలకు డబ్బింగ్ మొదలుపెట్టి ఏకధాటిగా నాలుగు గంటల్లో పూర్తి చేశారని టీమ్ చెప్పింది.
నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ ఓ పోరాట యోధుడిగా కనిపించనున్నారు.