Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సెట్స్ నుంచి వీడియో లీక్.. మార్కెట్‌లో హెలికాఫ్టర్ ల్యాండ్ అవుతున్న..

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సెట్స్ నుంచి వీడియో లీక్ అయ్యింది. మార్కెట్‌లో హెలికాఫ్టర్ ల్యాండ్ అవుతున్న..

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సెట్స్ నుంచి వీడియో లీక్.. మార్కెట్‌లో హెలికాఫ్టర్ ల్యాండ్ అవుతున్న..

helicopter landing scene leaked from ram charan game changer shooting sets

Game Changer : ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకి శంకర్ దర్శకుడు కావడం, మరో స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తుండడంతో పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సోషల్ ఇష్యూని కమర్షియల్ ఎలిమెంట్స్ తో చెప్పి బ్లాక్ బస్టర్ అందుకునే శంకర్.. ఇప్పుడు అదే ఫార్ములతో గేమ్ ఛేంజర్ ని తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీ అనౌన్స్ చేసి మూడేళ్లు అయ్యిపోయింది. కానీ ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. ఇక ఈ మూడేళ్లలో మేకర్స్ కూడా ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా ఫ్యాన్స్ ని బాధ పెడుతూ వస్తున్నారు. అయితే ఒక్క అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు.. అప్పుడప్పుడు లీక్డ్ వీడియోలు, ఫోటోలు సంతోషాన్ని ఇస్తున్నాయి. ఈక్రమంలోనే తాజాగా ఓ వీడియో నెట్టింట లీక్ అయ్యింది.

Also read : Anshu Ambani : ‘మన్మథుడు’ సమయంలో చాలా ఇబ్బందిని ఫేస్ చేశాను.. ఆయన వల్లే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాను..

సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను శంకర్ టీం ప్రస్తుతం తెరకెక్కిస్తోంది. ఈక్రమంలోనే మూవీలోని ఒక హైలైట్ సీన్ లో రామ్ చరణ్ హెలికాఫ్టర్ తో మార్కెట్ లో ల్యాండ్ అవుతారట. థియేటర్ లో ఈ ఎలివేషన్ సీన్ కి గూస్‌బంప్స్ వస్తున్నాయని చెబుతున్నారు. అలాంటి సన్నివేశాన్ని ప్రస్తుతం నెట్టింట లీక్ చేసేసారు. ఇక లీకైన వీడియోని అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు. ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.

కాగా ఈ ఏడాది జూన్ నాటికీ ఈ మూవీ షూటింగ్ అంతా పూర్తి అవుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేస్తామంటూ నిర్మాత దిల్ రాజు గతంలో పేర్కొన్నారు. మరి చెప్పినట్లు ఆ టైంకే తీసుకు వచ్చేస్తారా..? లేదా పోస్టుపోన్ చేస్తారా..? అనేది చూడాలి. కాగా ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, నాజర్, నవీన్ చంద్ర, సముద్రఖని, సునీల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.