చైతు, పల్లవిల ‘లవ్‌స్టోరి’ – టైటిల్ పోస్టర్ రిలీజ్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘లవ్‌స్టోరి’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు..

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘లవ్‌స్టోరి’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు..
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నుంచి ‘వెల్ కమ్ టు ది వరల్డ్ ఆఫ్ NC 19’ పేరుతో ఇటీవల గ్లింప్స్ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. చైతు హీరోగా నటిస్తున్న 19వ సినిమా ఇది. చైతు మేకోవర్ ఆకట్టుకుంటుంది.
‘మజిలీ’ తర్వాత మరో డిఫరెంట్ క్యారెక్టర్లో ప్రేక్షకులను అలరించనున్నాడు. సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. చైతు, సాయి పల్లవిలు భావోద్వేగంతో కనిపిస్తున్న లుక్ ఆకట్టుకుంటోంది. సంక్రాంతి తర్వాత కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ‘లవ్ స్టోరి’ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయనున్నారు.
సోనాలి నారంగ్ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఏమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కెమెరా : విజయ్ సి కుమార్, సంగీతం : పవన్.