RX 100 Sequel : ‘ఆర్‌ఎక్స్100’ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన హీరో కార్తికేయ.. ఉంటుందా? లేదా?
తాజాగా బెదురులంక ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కార్తికేయ ఆర్‌ఎక్స్100 సినిమా సీక్వెల్ గురించి మాట్లాడాడు.

Hero Karthikeya gives clarity on RX 100 Movie Sequel
RX 100 Movie Sequel : పరిశ్రమలో ఎప్పటి నుంచో ఉన్నా ఆర్‌ఎక్స్100 సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయ్యాడు కార్తికేయ(Karthikeya). అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఎక్స్100 చిన్న సినిమాగా రిలీజయి భారీ విజయం సాధించింది. పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో ఇద్దరికీ మంచి అవకాశాలు వచ్చాయి.
కార్తికేయకి మళ్లీ ఇటీవల ఫ్లాప్స్ వచ్చినా ఓ పక్క విలన్ గా కూడా చేసి మెప్పిస్తూ, మరోపక్క హీరోగా కొత్త కథలతో వస్తున్నాడు. ప్రస్తుతం కార్తికేయ, నేహశెట్టి జంటగా నటించిన బెదురులంక 2012 సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో కార్తికేయ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా బెదురులంక ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కార్తికేయ ఆర్‌ఎక్స్100 సినిమా సీక్వెల్ గురించి మాట్లాడాడు.
కార్తికేయ కెరీర్ ని మలుపు తిప్పిన ఆర్‌ఎక్స్100 సినిమాకు సీక్వెల్ గురించి ప్రశ్నించగా కార్తికేయ మాట్లాడుతూ.. ఆర్‌ఎక్స్100 సినిమా సీక్వెల్ ఉంటుందో లేదో చెప్పలేను కానీ ఆ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతితో మాత్రం కచ్చితంగా ఇంకో సినిమా ఉంది. అజయ్ కొన్ని కథలు వినిపించాడు. కథ ఫైనల్ అయ్యాక మా కాంబోలో సినిమాని ప్రకటిస్తాం. అది ఆర్‌ఎక్స్100 సీక్వెల్ అవుతుందో లేదో మాత్రం నేను చెప్పలేను అని తెలిపాడు. దీంతో ఆర్‌ఎక్స్100 సీక్వెల్ ఉండకపోవచ్చు అనే అనుకుంటున్నారు. ఇక డైరెక్టర్ అజయ్ పాయల్ రాజ్ పుత్ తో మంగళవారం అనే ఓ థ్రిల్లర్ సినిమా తీస్తున్నాడు.