HIT 2: ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసుకున్న హిట్ 2.. అందులోనే స్ట్రీమింగ్!
టాలీవుడ్లో క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీగా తెరకెక్కిన తాజా చిత్రం ‘హిట్-2’ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
HIT 2: టాలీవుడ్లో క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీగా తెరకెక్కిన తాజా చిత్రం ‘హిట్-2’ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు శైలేష్ కొలను హిట్ వర్స్‌లో రెండో మూవీగా ఈ సినిమా వస్తోంది. ఇక నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడంతో ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
Hit 2 : హిట్ 2 రివ్యూ.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. థియేటర్స్‌లోనే చూడాలి..
అడివి శేష్ హీరోగా నటిస్తున్న హిట్-2 టీజర్, ట్రైలర్లతోనే సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. దీంతో హిట్-2 చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ సిద్ధమయ్యింది. హిట్-2 చిత్ర థియేట్రికల్ రన్ ముగిసిన తరువాతే ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు.
HIT 2: అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ములేపుతున్న హిట్-2
పూర్తి థ్రిల్లర్ మూవీగా వస్తున్న హిట్-2లో అడివి శేష్ సరసన అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. మరి ఈ సినిమాకు థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందా, ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్కు వస్తుందా అని అభిమానులు అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.