హరిద్వార్‌లో హాలీవుడ్‌ స్టార్‌ హీరో

భారతీయ సాంప్రదాయాలకు, ఆచారాలకు విదేశీలు ఆకర్షితులవుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : April 8, 2019 / 08:43 AM IST
హరిద్వార్‌లో హాలీవుడ్‌ స్టార్‌ హీరో

Updated On : April 8, 2019 / 8:43 AM IST

భారతీయ సాంప్రదాయాలకు, ఆచారాలకు విదేశీలు ఆకర్షితులవుతున్నారు.

భారతీయ సాంప్రదాయాలకు, ఆచారాలకు విదేశీలు ఆకర్షితులవుతున్నారు. వేరే దేశాలకు చెందిన క్రీడాకారులు, సినీ తారలు ఇండియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలని సందర్శిస్తుంటారు. వీరిలో హాలీవుడు స్టార్ హీరో విల్‌స్మిత్‌ కూడా ఉన్నారు. విల్‌స్మిత్‌ తరుచూ భారత పర్యటన చేస్తుంటారు. తాజాగా మరోసారి ఇండియాలో పర్యంటించిన ఆయన హరిద్వార్‌లో ప్రత్యేక పూజలు చేశారు.
Read Also : ఐడియా అదుర్స్ : ట్యాక్సీపై IPL లైవ్ స్కోరు

ఓ సామాన్యుడిలా నేలపై కూర్చొని హరిద్వార్‌ విశిష్టతను తెలుసుకున్నారు. విల్ స్మిత్ తాను సందర్శించిన హరిద్వార్ పుణ్యక్షేత్ర ఫోటోలని ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. హరిద్వార్ పర్యటన గురించి విల్ స్మిత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. మా బామ్మ ఎప్పుడూ చెపుతూ ఉండేది. అనుభవం ద్వారానే భగవంతుడు మనకు అన్ని పాఠాలు నేర్పిస్తాడు అని. ఇండియా పర్యటన నాకు సరికొత్త అనుభవాన్ని ఇచ్చింది. కొత్త విషయాలు తెలుసుకున్నా అంటూ కామెంట్ చేశారు. 

విల్‌స్మిత్ ఈ ఫోటోలు పోస్ట్ చేసిన 24 గంటల్లోనే 19 లక్షలకు పైగా లైకులు రావటం విశేషం. విల్ స్మిత్ భారత సంప్రదాయాల పట్ల చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతేకాదు విల్ స్మిత్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హారతిని హరిద్వార్ ఘాట్ లో విడిచిపెట్టాడు.
Read Also : భాగ్యనగరంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం