రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం.. ప్రకటించేది ఎప్పుడంటే..

  • Published By: sekhar ,Published On : November 30, 2020 / 02:17 PM IST
రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం.. ప్రకటించేది ఎప్పుడంటే..

Updated On : November 30, 2020 / 7:15 PM IST

I will take a decision – Rajinikanth: సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్, తన రాజ‌కీయ రంగ ప్ర‌వేశం గురించి చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో 30 మంది అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షులతో గంటన్నరపాటు చర్చలు జరిపారు. Rajinikanthతన ఆలోచనలు, పార్టీ ప్రణాళికలు వంటివి చర్చించి.. అభిమానుల సలహాలు, సూచనలు, విజ్ఞప్తులు విన్నారు. తలైవా సొంతగా పార్టీ పెట్టాలని, ఒంటరిగా బరిలోకి దిగాలని ఫ్యాన్స్ కోరగా.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉందని, ఇంత తక్కువ టైంలో పార్టీ బలోపతం అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు రజినీ. బీజేపీకి మద్దతునిచ్చే అంశం గురించి కూడా సమావేశంలో చర్చ జరిగింది.


ఆర్ఎంఎం అధికారులు తమ అభిప్యాలను తనతో చెప్పారని, అలాగే తన అభిప్రాయాలను కూడా వారితో పంచుకున్నానని, ఏ నిర్ణయం తీసుకున్నా సరే నావెంట ఉంటామని వారు చెప్పారని, రాజకీయాల్లో ఎంట్రీ గురించి త్వరలోనే ప్రకటిస్తానని రజినీ తెలిపారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు రజినీ ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది.