Hyper Aadi : అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు.. ఈగోకి వెళ్తాడు.. హైపర్ ఆదిపై ఇంద్రజ కామెంట్స్ వైరల్..
తాజాగా నటి ఇంద్రజ ఈ విషయంలో హైపర్ ఆది గురించి కామెంట్స్ చేసింది.(Hyper Aadi)
Hyper Aadi
Hyper Aadi : హైపర్ ఆది జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు వేరే టీవీ షోలతో, సినిమాలతో బిజీ అయ్యాడు. ఆది స్కిట్స్ లో కామెడీ పంచులు బాగా వేస్తాడని తెలిసిందే. అయితే ఆది ఎక్కువగా బాడీ షేమింగ్ పంచులు వేస్తాడని, ట్రోలింగ్ కామెడీ చేస్తాడని, అవతలి వాళ్ళని తక్కువ చేసేలా డైలాగ్స్ వేస్తాడని, అప్పుడప్పుడు అడల్ట్ కామెడీ చేస్తాడని అతనిపై విమర్శలు కూడా ఉన్నాయి.(Hyper Aadi)
తాజాగా నటి ఇంద్రజ ఈ విషయంలో హైపర్ ఆది గురించి కామెంట్స్ చేసింది. ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన ఇంద్రజ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూనే మరోపక్క టీవీ షోలలో జడ్జిగా చేస్తుంది. ఇంద్రజ – ఆది కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కనిపిస్తారు.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంద్రజ మాట్లాడుతూ.. స్కిట్స్ లో ఒకరి మీద ఒకరు పంచులేస్తారు. పంచులేయడమే కామెడీ కాదు పంచులేస్తే తీసుకోవాలి కూడా. కానీ ఆది పంచులేస్తే తీసుకోడు. మా మీద పంచులేస్తే తీసుకోవాలి. మేము వేస్తే తీసుకోరు. దానికి ఏదో ఒకటి చెప్తారు. అది చాలా చెత్తగా ఉంటుంది ఆయన ఈగోకి వెళ్తారు. ఆయన పంచ్ వేస్తే తీసుకోలేకపోతున్నాడు.
ఎప్పుడు చూడు అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు. అమ్మాయిల మీద కామెడీ, అమ్మాయిల బాడీ షేమింగ్ చేస్తాడు, అవన్నీ పాత జోకులు అని చెప్తాను. ఆది మీద పంచులేస్తే కూడా జనాలు చూస్తారు. అది ఆయన గమనించట్లేదు. కానీ పర్సన్ గా నాకు ఆయనంటే గౌరవం. వర్క్ పర్సన్. ఎప్పుడూ వర్క్ గురించే ఆలోచిస్తారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఓ గ్రామం నుంచి వచ్చి అతను ఎదిగాడు. ఆయనకు ఏదైనా ఈవెంట్ వస్తే ఆయన చేయలేకపోతే వేరే వాళ్లకు ఇప్పిస్తాడు అది. ఆయనకు ఈవెంట్ వస్తే వేరే వాళ్ళను తీసుకెళ్తాడు. అలా వేరే వాళ్లకు సపోర్ట్ చేస్తాడు అని తెలిపింది.
Also Read : Payal Rajput : RX100 భామ పాయల్ రాజ్ పుత్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
