ఇర్ఫాన్ తల్లి ఇకలేరు..వీడియో కాల్ లో చివరి చూపులు

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌కు మాతృవియోగం సంభవించింది. ఆయన తల్లి సైదా బేగం శనివారం ఉదయం కన్నుమూశారు. ఆమె వయస్సు 95 సంవత్సరాలు. టోంక్‌లోని నవాబ్ ఫ్యామిలీకి చెందిన సైదా బేగం చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జైపూర్‌లోని బెనివాల్ కాంట కృష్ణ కాలనీ (Beniwal Kanta Krishna Colony) లో ఆమె నివసిస్తున్నారు. వయోభారం మరియు సహజ కారణాలతోనే సైదా బేగం కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇర్ఫాన్ జైపూర్‌కు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది. ఇటీవలే క్యాన్సర్ నుండి కోలుకున్న ఆయనకు తల్లి మరణం తీరని లోటు అని సన్నిహితులు తెలిపారు. కాగా సైదా బేగం మరణ వార్త తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ మరియు మెసేజుల ద్వారా తమ సంతాపాన్ని తెలుపుతున్నారు.