పవన్ కల్యాణ్‌తో పొలిటికల్ మూవీ? ఏం జరుగుతోంది?
ప్రొడ్యూసర్ నాగవంశీ ఇటీవల చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan
పవర్ స్టార్.. ఈ పేరే ఓ వైబ్రేషన్. ఆ కటౌట్ వెండితెర మీద కనిపిస్తే బాక్సాఫీస్ బద్దలే. కానీ కొన్నాళ్లుగా పవన్ కల్యాణ్ మూవీస్‌ను మిస్ అవుతూ వస్తున్నారు ఫ్యాన్స్. సేనాని పాలిటిక్స్‌లో బిజీగా ఉండటంతో ఇప్పటికే ఆయన కమిట్ అయిన మూడు సినిమాల షూటింగ్ పెడింగ్‌లో పడింది. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీస్ షూటింగ్ త్వరలోనే ట్రాక్ ఎక్కుతుందని అంటున్నారు. ఇందులో ఓ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తారని కూడా టాక్.
ఆ మూడు సినిమాల తర్వాత పవన్ మరిన్ని మూవీస్ చేస్తాడా లేదా అన్నది ఇప్పటికైతే సస్పెన్స్‌గానే ఉంది. అయితే ప్రొడ్యూసర్ నాగవంశీ ఇటీవల చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నాయి. 2029లో ఓ పెద్ద స్టార్‌తో పొలిటికల్ మూవీ చేయబోతున్నట్లు చెప్పాడు. దాంతో 2029లో చేసే సినిమా పవన్‌తోనన్న ప్రచారం జరుగుతోంది. ఎలక్షన్ టైమ్‌లో రిలీజ్ చేస్తారని కూడా అంటున్నారు. ఆ మూవీకి త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇది రియలో వైరలో తెలియదు కానీ..ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
నిజానికి పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. తను కమిట్ అయిన మూడు సినిమాలకు టైమిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కాస్త రిలీఫ్ కాగానే పవన్ డేట్స్ ఇస్తారని నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. అయితే పెద్దమూవీని కనుగ పవన్ ఒప్పుకుంటే సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండబోతుంది. అది పక్కా పొలిటికల్ పిక్చర్ కావడంతో పాటు పాలిటిక్స్‌ను ఇన్‌ఫ్లుయెన్స్ చేసేలా కథ ఉంటుందన్న చర్చ జరుగుతోంది.