Iswarya Menon : ఈ హీరోయిన్ భరత నాట్యం డ్యాన్సర్ అని మీకు తెలుసా..? ‘భజే వాయువేగం’ ప్రమోషన్స్‌లో..

పదేళ్ల పైగా సినీ పరిశ్రమలో ఉండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా ఎదిగిన ఐశ్వర్య మీనన్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది.

Iswarya Menon : ఈ హీరోయిన్ భరత నాట్యం డ్యాన్సర్ అని మీకు తెలుసా..? ‘భజే వాయువేగం’ ప్రమోషన్స్‌లో..

Iswarya Menon Says Interesting Facts about her and Bhaje Vaayu Vegam Movie

Iswarya Menon : దాదాపు పదేళ్ల పైగా సినీ పరిశ్రమలో ఉండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా ఎదిగిన ఐశ్వర్య మీనన్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది. తెలుగులో స్పై సినిమాలో స్టైలిష్ యాక్షన్ తో అదరగొట్టిన ఐశ్వర్య మీనన్ ఇప్పుడు కార్తికేయ సరసన ‘భజే వాయువేగం’ సినిమాలో కనిపించనుంది. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భజే వాయువేగం సినిమా మే 31న రాబోతుంది. ఈ క్రమంలో ఐశ్వర్య మీనన్ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

ఐశ్వర్య మీనన్ ‘భజే వాయువేగం’ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఇందు అనే బ్యూటీషియన్ పాత్ర చేశాను. కథ అంతా హీరో పర్సెప్షన్ లోనే వెళ్లినా నేను కీలక పాత్రగా ఉంటాను. ఈ సినిమా స్పై కంటే ముందు ఒప్పుకున్నాను. ఈ సినిమా డైరెక్టర్ తెలుగులో నన్ను పరిచయం చేయాలి అనుకున్నాడు. ఫోన్ లో స్క్రిప్ట్ చెప్పాడు. డైరెక్టర్ చాలా బాగా కథ నేరేట్ చేశాడు. షూట్ లో మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాడు. ఈ సినిమాలో ట్రెడిషనల్ గా కనిపిస్తాను. నాకు చీరలో చాలా కంఫర్ట్ గా ఉంటాను. రియల్ లైఫ్ లో కూడా ట్రెడిషనల్ దుస్తులు ఎక్కువ వాడతాను. స్పైలో యాక్షన్స్ చేశాను. కానీ ఇందులో ఆ క్యారెక్టర్ కి వ్యతిరేకంగా ఉంటుంది. యాక్షన్ తో పాటు ఎమోషన్, లవ్, రొమాన్స్ కూడా ఈ సినిమాలో ఉంది. ట్విస్ట్ లు చాలా ఉన్నాయి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి నేను డబ్బింగ్ చెప్పలేదు. నా ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాను, ఫలితం ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది అని తెలిపింది.

కార్తికేయ గురించి, తన గురించి మాట్లాడుతూ.. కార్తికేయ ఆర్ఎక్స్ 100 సినిమా చూశాను. అతనితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. అతను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. మంచి డ్యాన్సర్ కూడా. నేను భరతనాట్యం డ్యాన్సర్ ని. చిన్నప్పుడు స్టేజీలపై, స్కూల్స్, కాలేజీలలో చాలా పర్ఫార్మెన్స్ లు ఇచ్చాను. సినిమాల్లో కూడా మంచి డ్యాన్స్ సాంగ్ చేయాలని ఉంది. కానీ ఇప్పటివరకు డ్యాన్స్ చేసే సాంగ్స్ నాకు రాలేదు. ఫ్యూచర్ లో వస్తాయేమో చూడాలి. పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ తో పాటు కమర్షియల్ సినిమాలు కూడా చేయాలని ఉంది అని చెప్పింది.

Also Read : Indraja : జబర్దస్త్ వదిలేస్తున్న ఇంద్రజ.. స్టేజిపై ఏడుస్తూ..

తన నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడుతూ.. స్పై సినిమా తర్వాత తెలుగులో ఆఫర్స్ వచ్చాయి. కానీ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తున్నా. తెలుగు ఇండస్ట్రీ నాకు నచ్చింది. ఇక్కడే ఎక్కువ సినిమాలు చేయాలి అనుకుంటున్నాను. తెలుగులో ఓ సినిమా ఓకే చేశాను. త్వరలో దాని ప్రకటన వస్తుంది. ఇంకో రెండు సినిమాలు డిస్కషన్స్ జరుగుతున్నాయి. తమిళ్ లో ఓ సినిమా చేస్తున్నాను అని తెలిపింది.

Iswarya Menon Says Interesting Facts about her and Bhaje Vaayu Vegam Movie

ఇక తన కెరీర్ గురించి చెప్తూ.. తమిళనాడులో ఈరోడ్ అనే ఓ చిన్న సిటీ నుంచి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా ఇంట్లో ఎవరికీ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. ఇంజనీరింగ్ చేశాను. స్కూల్ నుంచే నేను చదువుతో పాటు యాడ్స్ లో నటించడం, కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడంతో పేరొచ్చింది. దాంతో ఇంజినీరింగ్ అయ్యాక యాక్టింగ్ మీదే ఫోకస్ చేశాను. పదేళ్ల కెరీర్ ని నేను స్టెప్ బై స్టెప్ నిర్మించుకున్నాను. అభిమానుల్ని సంపాదించుకోవడం, ప్రేక్షకుల ఆదరణ పొందటం సంతోషంగా ఉంది అని చెప్పింది.