Ustaad : ఉస్తాద్ షో నెక్ట్స్ గెస్ట్ ఎవరో రివీల్ అయిపోయింది.. ఆ స్టార్ హీరో ఎవరంటే?

మంచు మనోజ్ 'ఉస్తాద్' షో దూసుకుపోతోంది. నెక్ట్స్ ఎపిసోడ్ జనవరి 4 న టెలికాస్ట్ అవుతోంది. అయితే ఈ ఎపిసోడ్‌లో కనిపించబోతున్న టాప్ స్టార్ ఎవరో తెలిసిపోయింది.

Ustaad : ఉస్తాద్ షో నెక్ట్స్ గెస్ట్ ఎవరో రివీల్ అయిపోయింది.. ఆ స్టార్ హీరో ఎవరంటే?

Ustaad

Updated On : January 2, 2024 / 7:48 PM IST

Ustaad : దశాబ్దం పాటుగా సినిమాలకు దూరంగా మంచు మనోజ్ ‘ఉస్తాద్’ సెలబ్రిటీ గేమ్ షోతో ఆడియన్స్ ముందుకి వచ్చారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఈ విన్’ లో ఈ షో టెలికాస్ట్ అవుతోంది. అయితే జనవరి 4 న ప్రసారం కాబోతున్న షోలో గెస్ట్ ఎవరో కనిపెట్టండి అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.  ఆ గెస్ట్ ఎవరో ఇప్పుడు అందరికి తెలిసిపోయింది.

Anupama Parameswaran : తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చూపించిన అనుపమ..

మనోజ్ ‘ఉస్తాడ్’ టాక్ షో మొదలుపెట్టాక నాని, రానా దగ్గుబాటి, సిద్దు జొన్నలగడ్డ గెస్ట్‌లు గా వచ్చారు. కాగా జనవరి 4 ప్రసారం కానున్న షోకి హైప్ పెంచడంలో భాగంగా గెస్ట్ ఎవరో కనిపెట్టండి అంటూ జనవరి 1 న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూసిన వారంతా హీరో రవితేజ అని కామెంట్స్ చేసారు. కానీ వాళ్ల ఎక్స్‌పెక్టేషన్స్ రాంగ్ అని చెబుతూ ఆ గెస్ట్ ఎవరో రివీల్ చేసారు షో నిర్వాహకులు.

Ambajipeta Marriage Band : ‘మా ఊరు అంబాజీపేట’ లిరికల్ సాంగ్ రిలీజ్..

ఉస్తాద్ టాక్ షో జనవరి 4 న ప్రసారం కాబోతోన్న ఎపిసోడ్‌లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గెస్ట్‌గా రాబోతున్నట్లు మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. ఇక విశ్వక్ సేన్‌తో మనోజ్ ఏం మాట్లాడించబోతున్నారో చూడటానికి ఆడియన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ టాక్ షోని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా విశ్వక్ సేన్ ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ మార్చి 8 న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీని ‘ఛల్ మోహన్ రంగ’ ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నారు. మరోవైపు ‘V10’ తో పాటు అడ్వెంచరస్ మూవీ ‘గామి’ కూడా పూర్తి చేశారు విశ్వక్ సేన్.

 

View this post on Instagram

 

A post shared by Manoj Manchu (@manojkmanchu)