Kevvu karthik : తను చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్!
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తాను చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేశాడు.

Jabardasth comedian Kevvu karthik introduce his better half
Jabardasth Kevvu karthik : జబర్దస్త్ కమెడియన్స్ ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటీవలే రాకింగ్ రాకేష్ (Rakesh), జోర్దార్ సుజాత (Sujatha) ని పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడు అయ్యాడు. ఇక తాజాగా మరో జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ కూడా ఏడడుగులు వేయబోతున్నట్లు ప్రకటించాడు. మూడు రోజులు క్రిందట తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటిస్తూ.. వధువుతో ఉన్న ఫోటోని షేర్ చేశాడు. అయితే ఆమె పేస్ కనబడకుండా జాగ్రత్త పడ్డాడు. తాజాగా ఆమె పేస్ రివీల్ చేస్తూ అభిమానులకు పరిచయం చేశాడు.
ఆమెతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. “పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటుంటే అప్పటిలో నాకు అర్ధం కాలేదు. కానీ ఇప్పుడు అర్ధమైంది. రెండు భిన్నమైన ప్రపంచాలు, భిన్నమైన జీవితాలు, భిన్నమైన మనసులు, ఆలోచనలు ఉన్న రెండు హృదయాలు నేడు ఒక కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నాయి. నా జీవితంలోకి నీకు ప్రేమతో ఆహ్వానం పలుకుతున్న సిరి. ఈమె నేను చేసుకోబోయే అమ్మాయి” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు కార్తీక్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా వీరిద్దరి పెళ్లి ఎప్పుడు జరగబోతుంది అనేది ఇంకా తెలియజేయలేదు. ఇక కార్తీక్ విషయానికి వస్తే.. జబర్దస్త్ ద్వారా ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నాడు. కానీ దానికి ముందు ఎంతో కష్టాన్ని ఎదురుకున్నాడు. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే మిమిక్రీలో డిప్లొమా సంపాదించాడు. ఆ తరువాత ఎంటెక్ పూర్తి చేసి జాబ్ లో జాయిన్ అయ్యినా.. మిమిక్రీ, కామెడీ పై ఉన్న ప్యాషన్‌తో దానిని వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాడు. ఇక అక్కడ స్టేజి షోలు చేస్తూ జబర్దస్త్ వరకు చేరుకున్నాడు.
View this post on Instagram