Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లేడీ ఓరియెంటెడ్ సినిమా.. టాలీవుడ్‌ డైరెక్టర్‌తో..

తెలుగు లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రానుంది.

Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లేడీ ఓరియెంటెడ్ సినిమా.. టాలీవుడ్‌ డైరెక్టర్‌తో..

Jacqueline Fernandez

Updated On : August 5, 2025 / 3:47 PM IST

Jacqueline Fernandez : బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్ సినిమాలతో ఇక్కడ ప్రేక్షకులను కూడా మెప్పించింది. నటిగానే కాకుండా స్పెషల్ సాంగ్స్ తో వైరల్ అయింది. గతంలో తెలుగులో సాహో సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో అలరించింది. ఇప్పుడు తెలుగు లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రానుంది.

పేపర్ బాయ్, అరి సినిమాలు తీసిన దర్శకుడు వి.జయశంకర్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ సినిమా రాబోతుంది. ఈ సినిమా కోసం జయశంకర్ ఆల్రెడీ జాక్వెలిన్‌కు యాక్షన్, సస్పెన్స్‌తో కూడిన ఒక ఇంటెన్స్ స్క్రిప్ట్‌ను చెప్పినట్టు సమాచారం. జాక్వెలిన్‌కు కూడా ఆ సినిమా పాత్ర, కథ నచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ లేడీగా జాక్వెలిన్ కనిపించబోతుంది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బాలీవుడ్ సమాచారం.

Also Read : Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా.. ఓటీటీలోకి.. ఎందులో? ఎప్పుడు?

ఇక ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్‌ కూడా ఎక్కువే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ భాషల్లో నిర్మించనున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ జయశంకర్ స్క్రిప్ట్ ఫైనల్ వర్క్ లో ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనున్నట్టు సమాచారం.