Jagapathi Babu : వాళ్ళు నన్ను మోసం చేశారు.. త్వరలోనే వాళ్ళ వివరాలు చెప్తాను..

తాజాగా జగపతి బాబు రియల్ ఎస్టేట్ విషయంలో మోసం చేశారు అంటూ ఓ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.

Jagapathi Babu : వాళ్ళు నన్ను మోసం చేశారు.. త్వరలోనే వాళ్ళ వివరాలు చెప్తాను..

Jagapathi Babu was Cheated by Real Estate People Sensational Comments goes Viral

Updated On : May 29, 2024 / 9:57 AM IST

Jagapathi Babu : నటుడు జగపతి బాబు హీరోగా గతంలో ఎన్నో సినిమాలతో మెప్పించి ఫ్యామిలీ హీరో అనిపించుకున్నారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం జగపతి బాబు సినిమాలతో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ చాలా యాక్టివ్ గా ఉంటారు.

తాజాగా జగపతి బాబు రియల్ ఎస్టేట్ విషయంలో మోసం చేశారు అంటూ ఓ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.

Also Read : Jabardasth : షాకింగ్ న్యూస్.. ఏకంగా జబర్దస్త్‌నే తీసేస్తున్నారు.. ఏడ్చేసిన రష్మీ, కుష్బూ, కంటెస్టెంట్స్..

ఈ వీడియోలో జగపతి బాబు మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో హెచ్చరించారు. ఇటీవల నేను ఓ రియల్ ఎస్టేట్ యాడ్ లో నటించాను. నన్ను కూడా మోసం చేశారు. వాళ్ళు ఎవరు అనేది త్వరలోనే చెప్తాను. ల్యాండ్ కొనేటప్పుడు రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకొని జాగ్రత్త పడండి. ఎవరి ట్రాప్​లో పడొద్దు అని తెలిపారు. దీంతో జగపతి బాబు వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మరి జగపతి బాబుని మోసం చేసింది ఎవరో అని చర్చించుకుంటున్నారు.