Jani Master Wife : ఆయన అరెస్ట్ అయిన సంగతి నా పిల్లలకు చెప్పలేదు.. ఎమోషనల్ అయిన జానీ మాస్టర్ భార్య..
ఈ ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ భార్య మాట్లాడుతూ..

Jani Master Wife Got Emotional in Recent Interview while Talking about her Childrens
Jani Master Wife : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల ఓ లేడీ కొరియోగ్రాఫర్ చేసిన లైంగిక ఆరోపణలతో అరెస్ట్ అయి జైలుకెళ్ళొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు జానీ మాస్టర్. అరెస్ట్ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న జానీ మాస్టర్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ తన డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలుపెడుతూ ఫ్యామిలీతో గడుపుతున్నారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి జానీ మాస్టర్ తన భార్య సుమలతతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గురించి, తన భార్య ఇచ్చిన సపోర్ట్, జైలు జీవితం, తన ఫ్యామిలీ.. ఇలా అనేక సంగతులు మాట్లాడారు కానీ కేసు కోర్టులో ఉండటంతో ఆరోపణలపై మాత్రం మాట్లాడలేదు.
ఈ ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ భార్య మాట్లాడుతూ.. జానీ మాస్టర్ అరెస్ట్ అయిన విషయం పిల్లలకు చెప్పలేదు. జైలుకి వెళ్లారు అని చెప్పలేను. షూటింగ్ లో ఉన్నారని చెప్పాను. ఎవరైనా మా పిల్లల్ని మీ డాడీ ఎక్కడ అని అడిగితే షూటింగ్ కి వెళ్ళాడు అని చెప్పేవాళ్ళు. పిల్లలని జైలుకు తీసుకెళ్లలేదు. ఆయన జైలులో ఉన్నన్ని రోజులు వాళ్లకు స్కూల్, ఇల్లు అంతే. బయటకి పంపిస్తే ఎవరు ఏం అడుగుతారో అని బాధ. ఆ సమయంలో నాకు నా పిల్లలు అలియా, సిరాజ్ సపోర్ట్ ఇచ్చారు. నేను ఒక్కదాన్నే కూర్చొని రూమ్ లో ఏడుస్తుంటే వచ్చి నువ్ అలా ఉంటే నాకు ఏడుపొస్తుంది, డాడీ షూటింగ్ నుంచి వచ్చేస్తారు అని హగ్ చేసుకొని సపోర్ట్ చేశారు. వాళ్లకు తెలుసో లేదో కానీ నన్ను ఏమి అడగలేదు. కనీసం డాడీకి కాల్ చెయ్యి, వీడియో కాల్ చెయ్ అని కూడా అడగలేదు. టీవీలో కూడా మాస్టర్ గురించి ఎప్పుడు చూడలేదు. ఆ నెల రోజులు ఎక్కడికీ పంపించలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు.
జానీ మాస్టర్ కూడా తన పిల్లల గురించి మాట్లాడుతూ.. జైలు నుంచి బయటకు రాగానే నా పిల్లలు నన్ను హగ్ చేసుకోగానే ఏడ్చేసాను. నా కొడుకు నన్ను హత్తుకొని ఏడ్చాడు. పాప నా దగ్గరికి వచ్చి అలియా అంటే హ్యాపినెస్ ఎప్పుడు ఏడవకూడదు అన్నావుగా అందుకే ఏడవట్లేదు. నాకు ఏడ్వాలని ఉంది అని చెప్పింది నవ్వుతూ ఏడ్చింది అంటూ ఎమోషనల్ అయ్యారు.