Jigris Review : ‘జిగ్రీస్’ మూవీ రివ్యూ.. హీరోయిన్ లేకుండానే సినిమా.. సందీప్ వంగ ఫ్రెండ్ తీసిన సినిమా ఎలా ఉందంటే..?

ఈ సినిమాలో హీరోయిన్ లేకపోవడం గమనార్హం.(Jigris Review)

Jigris Review : ‘జిగ్రీస్’ మూవీ రివ్యూ.. హీరోయిన్ లేకుండానే సినిమా.. సందీప్ వంగ ఫ్రెండ్ తీసిన సినిమా ఎలా ఉందంటే..?

Jigris Review

Updated On : November 13, 2025 / 12:52 PM IST

Jigris Review : కృష్ణ బూరుగుల, రామ్ నితిన్, ధీరజ్ ఆత్రేయ, మని వాక.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘జిగ్రీస్’. మౌంట్ మేరు పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ రెడ్డి వంగ చిన్ననాటి స్నేహితుడు కృష్ణ వోడపల్లి నిర్మాణంలో హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ లేకపోవడం గమనార్హం. సందీప్ వంగ తన చిన్ననాటి స్నేహితుడు సినిమా నిర్మించడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కి బాగానే సపోర్ట్ చేసాడు. జిగ్రీస్ సినిమా నవంబర్ 14న థియేటర్స్ లో రిలీజవుతుండగా రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు.(Jigris Review)

కథ విషయానికొస్తే.. ప్రవీణ్(రామ్ నితిన్), కార్తిక్ (కృష్ణ బూరుగుల), ప్రశాంత్ (మని వాక), వినయ్ (ధీరజ్ ఆత్రేయ) లు చిన్నప్పట్నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్లంతా గోవాకి వెల్దామనుకుంటారు. అలా అనుకోని ఓ రోజు రాత్రి తాగిన మైకంలో మారుతి 800 కార్ లో గోవాకి బయలుదేరుతారు. గోవాకి అని బయలుదేరిన వీళ్ళ కారు మధ్యలో ఆగిపోతుంది. దాన్ని రిపేర్ చేయడానికి ఓ మెకానిక్ వస్తాడు.

వీళ్ళ దగ్గర ఒకానొక సమయానికి డబ్బులు కూడా ఉండవు కానీ గోవాకి వెళ్దాం అని సాగుతూనే ఉంటారు. మరి ఈ నలుగురు ఫ్రెండ్స్ గోవాకు వెళ్ళారా? మధ్యలో వచ్చిన మెకానిక్ తో వీళ్ళు పడ్డ ఇబ్బందులు ఏంటి? ఆ కార్ బాగైందా? డబ్బులు లేకుండా గోవా ఎలా వెళ్తారు? అక్కడికి వెళ్లి ఏం చేస్తారు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Yenugu Thondam Ghatikachalam : 25 ఏళ్ళ యువతి 64 ఏళ్ళ ముసలోడు.. శోభనం రాత్రి బిగ్ ట్విస్ట్.. ‘ఏనుగుతొండం ఘటికాచలం’ రివ్యూ..

సినిమా విశ్లేషణ..

ఓ నలుగురు అబ్బాయిలు కలిసి గోవాకి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్ తో ఉంటేనే లైఫ్ అని ఈ నగరానికి ఏమైంది సినిమా వచ్చిన తర్వాత ఇదే లైన్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఈ జిగ్రీస్ కూడా ఆల్మోస్ట్ అలాంటి కథే. చిన్ననాటి నలుగురు ఫ్రెండ్స్ తాగిన మైకంలో ఎంజాయ్ చేద్దామని గోవాకి కార్ లో బయలుదేరితే మధ్యలో వీళ్ళు ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి అని కామెడీగా తెరకెక్కించారు.

కథ పరంగా రొటీన్ అయినా సీన్స్ కొత్తగా రాసుకున్నారు. ధాబా దగ్గర సీన్, మావోయిస్టుల సీన్, కండోమ్ సీన్, లారీ సీన్, కోడి సీన్.. ఇలా పలు సీన్స్ ఫుల్ గా నవ్విస్తాయి. హ్యాపీ ఎండింగ్ తో ముగించొచ్చు కానీ క్లైమాక్స్ కాస్త ఎమోషన్ తో ముగించారు. గోవా వెళ్లాలనుకునే ఫ్రెండ్స్ ఈ సినిమాకు బాగానే కనెక్ట్ అవుతారు. మిగిలిన వాళ్లకు ఇది ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమానే అనిపిస్తుంది.

ఈ సినిమాలో అసలు హీరోయిన్ అనే పాత్రే లేకపోవడం గమనార్హం. ఇటీవల కాలంలో తెలుగులో హీరోయిన్ లేకుండా సినిమా రావడం చాలా రేర్. కాసేపు ఫ్రెండ్స్ తో కలిసి నవ్వుకోడానికి అయితే జిగ్రీస్ సినిమాకు వెళ్లొచ్చు. జిగ్రీస్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అని అర్ధం. టైటిల్ కి తగ్గట్టే కథలో ఫ్రెండ్స్ బంధాన్ని చూపించారు.

Jigris Review

Image Credits : Mount Meru Pictures

నటీనటుల పర్ఫార్మెన్స్.. కృష్ణ బూరుగుల మాత్రం తన యాక్టింగ్ తో, టైమింగ్ తో ఫుల్ గా నవ్విస్తాడు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన రామ్ నితిన్ బాగానే మెప్పించాడు. మిగిలిన ధీరజ్ ఆత్రేయ, మని వాక కూడా అక్కడక్కడా నవ్విస్తారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. పాటలు మాత్రం యావరేజ్. పాత పాయింట్ తీసుకున్నా కొత్త సీన్స్ తో నవ్వించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా కావాల్సినంత బడ్జెట్ పెట్టి బాగానే తెరకెక్కించారు.

Also See : The Girlfriend Success Meet : రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ మీట్.. హాజరయిన బాయ్ ఫ్రెండ్.. ఫొటోలు వైరల్..

మొత్తంగా ‘జిగ్రీస్’ ఓ నలుగురు చిన్ననాటి స్నేహితులు గోవాకి వెళ్లే ప్రయాణంలో ఎదుర్కున్న సంఘటనలు ఏంటి అని కామెడీగా చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.