Jr. NTR: ఏపీలో బీజేపీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్.. బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు!
సినీ, రాజకీయపరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న చర్చ టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బీజేపీలో చేరనున్నారా? ఇటీవల బీజేపీ జాతీయ నాయకుడు అమిత్ షా ఎన్టీఆర్ ని కలవడం మనకి తెలిసిందే. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Junior NTR for BJP campaign in AP
Jr. NTR: సినీ, రాజకీయపరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న చర్చ టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బీజేపీలో చేరనున్నారా? ఇటీవల బీజేపీ జాతీయ నాయకుడు అమిత్ షా ఎన్టీఆర్ ని కలవడం మనకి తెలిసిందే. కాగా ఈ మీటింగ్ లో దేనిపై చర్చ జరిగింది అన్న విషయమైతే నేటి వరకు గోప్యంగా ఉంది. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
National Cinema Day: మల్టీప్లెక్స్‌లలో రూ.75 కే సినిమా.. ఎప్పుడంటే?
దర్శకదీర్రుడు రాజమౌళి తెరకెక్కించిన RRR ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరకి తెలిసిందే. ఇక అందులో నటించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు నటనకు గాను ప్రపంచ నలుమూలల నుంచి నీరాజనాలు అందుకుంటున్నారు. ఇందులో భాగంగానే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ని కలిసినట్టు ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చినప్పటికీ అందులో నిజం లేదంటూ సినీ, రాజకీయ వర్గాలతో పాటు నెటిజెన్లు కూడా కొట్టిపారేశారు.
NTR Finally Okays Buchchi Babu: బుచ్చిబాబుకు ఎట్టకేలకు తారక్ ఓకే చెప్పేశాడా..?
అయితే నేడు(సెప్టెంబర్ 4) బీజేపీ నాయకుడు సోము వీర్రాజు విలేకర్లతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ బీజేపీ తరుపున ప్రచారం చేయబోతున్నాడా? ఒకవేళ చేస్తే అది ఏపీ నుంచా లేక తెలంగాణ నుంచా అన్న విలేకర్ల ప్రశ్నకు ఇలా బదులిచ్చారు..”ఎన్టీఆర్ కు ఎక్కడ ప్రజాధరణ ఎక్కువుంటే అక్కడ ఉపయోగించుకుంటాం. ఆయన మీటింగ్ లు పెడితే ఎక్కడ జనాలు ఎక్కువగా వస్తారో కూడా తెలుసు” అని బదులిచ్చారు. దీనిబట్టి రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎన్టీఆర్ ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ వార్తలపై ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు.