విష్ణుతో డేటింగ్‌లో ఉన్నా.. పెళ్లెప్పుడో తెలియదు..
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా తాను తమిళ నటుడు విష్ణు విశాల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు తెలిపింది..

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా తాను తమిళ నటుడు విష్ణు విశాల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు తెలిపింది..
తమిళ్ యంగ్ హీరో విష్ణు విశాల్‌తో డేటింగ్ చేస్తున్నట్టు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా ఓపెన్ అయింది. విష్ణు విశాల్, జ్వాల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని గతకొద్ది కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. విష్ణు విశాల్, జ్వాలతో కలిసి తీసుకున్న సెల్ఫీలను ట్విట్టర్లో పోస్ట్ చెయ్యడం, ఒకరి బర్త్‌డేలు ఒకరు సెలబ్రేట్ చేసుకోవడం చూసి వీళ్లు ప్రేమలో ఉన్నారా? అనే సందేహాలు ఏర్పడ్డాయి అందరికీ. ప్రేమికులరోజు నాడు స్వయంగా జ్వాల, విష్ణుతో తన రిలేషన్ గురించి బయటపెట్టింది.
వేలంటైన్స్ డే రోజున విష్ణు విశాల్‌కు ముద్దిస్తున్న ఫోటో షేర్ చేస్తూ ‘ఇతడే నా వేలంటైన్’ అని పోస్ట్ చేసింది. తాజాగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తాను విష్ణుతో డేటింగ్ చేస్తున్నట్టు తెలిపింది జ్వాల.. ఇంతకుముందు మీడియా ఎప్పుడు విష్ణు విశాల్‌తో తన రిలేషన్ గురించి అడిగినా ‘అది నా పర్సనల్’ అంటూ మాట దాటవేస్తూ వచ్చిన జ్వాల తన రిలేషన్ గురించి ఓపెన్ అయింది. ‘‘మేం డేటింగ్‌లో ఉన్నాం. మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. కానీ త్వరలోనే ఒకటవుతాం.. అప్పుడు తప్పకుండా అందర్నీ ఆహ్వానిస్తాం’’.. అంటూ విష్ణుతో తాను రిలేషన్‌లో ఉందనే విషయాన్ని కన్ఫామ్ చేసింది.
Also Read | ‘ప్రశ్నిస్తా.. ప్రశ్నించడానికే వచ్చా.. ఒక్కొక్కరికీ బల్బులు పగిలిపోతాయ్’..
2005లో తోటి బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను జ్వాల మ్యారేజ్ చేసుకుంది. 2011లో వీళ్లు విడిపోయారు. తర్వాత చేతన్ మరో పెళ్లి చేసుకున్నాడు.. విష్ణు విశాల్ వివాహం 2011లో ప్రముఖ తమిళ నటుడు కె.నటరాజ్ కుమార్తె రజినీతో జరిగింది. వీరికి ఆర్యన్ అనే బాబు ఉన్నాడు. 2018లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విష్ణు, జ్వాల కంటే ఒక సంవత్సరం చిన్నవాడు కావడం విశేషం..