Jyothi : శ్రీకాంత్ అయ్యంగార్ తో పెళ్లి పై క్లారిటీ.. నేను రెండో పెళ్లి చేసుకుంటాను కానీ..

ఈ జంట పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి.(Jyothi)

Jyothi : శ్రీకాంత్ అయ్యంగార్ తో పెళ్లి పై క్లారిటీ.. నేను రెండో పెళ్లి చేసుకుంటాను కానీ..

Jyothi

Updated On : November 16, 2025 / 11:21 AM IST

Jyothi : ఇటీవల కొన్నాళ్ల క్రితం నటి జ్యోతి సీనియర్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ తో క్లోజ్ గా కనిపించి వైరల్ అయింది. జ్యోతి బర్త్ డే పార్టీకి వచ్చిన శ్రీకాంత్ అయ్యంగార్ ఆమెని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకోవడంతో ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఈ జంట పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి.(Jyothi)

తాజాగా ఓ ఛానల్ కి జ్యోతి ఇంటర్వ్యూ ఇవ్వగా శ్రీకాంత్ అయ్యంగార్ తో పెళ్లి పై, తన రెండో పెళ్లి గురించి మాట్లాడింది. గతంలో జ్యోతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని బాబుని కన్న తర్వాత రెండేళ్లకు విడాకులు తీసుకుంది. అప్పట్నుంచి సింగిల్ గానే ఉంటుంది జ్యోతి.

Also See : Priyanka Chopra : దేశీ గర్ల్.. వారణాసి ఈవెంట్లో.. ప్రియాంక చోప్రా.. చీరకట్టులో ఏంజిల్ లుక్స్..

తాజాగా ఇంటర్వ్యూలో జ్యోతి మాట్లాడుతూ.. శ్రీకాంత్ అయ్యంగార్ తో పెళ్లి అనే వార్తలు ఫేక్. నేను బర్త్ డే పార్టీ ఉంటే వెళ్ళాను. నాకు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ సీన్ లో నన్ను హత్తుకొని కిస్ చేయాలి. శ్రీకాంత్ అది నన్ను అడిగి చేసారు. ఇలా ఫోటో తీసుకుందాం అంటే ఓకే అన్నాను. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అన్నారు. సరే అంటే ఆ ఫోటో షేర్ చేసి.. మ్యారేజ్ అంటూ ఏదో పోస్ట్ చేసారు.

ఇంకేముంది అంతా అయిపొయింది. బాగా ట్రోల్ చేసారు. సోషల్ మీడియాలో వైరల్ అయింది. నరేష్ – పవిత్ర లాగా మా జంట అని అన్నారు. అది జస్ట్ సినిమా కోసం అనుకోకుండా జరిగింది. ఆ వార్తలన్నీ ఫేక్. ఆయన ఒక మంచి ఫ్రెండ్. నేను రెండో పెళ్లి చేసుకుంటాను. నాకు ప్రపోజల్స్ వస్తున్నాయి కానీ నా బాధ్యతలు చూసి వెనక్కి వెళ్లిపోతున్నారు. నాకు మంచి పార్ట్నర్ కావలి. నన్ను ప్రిన్సెస్ లాగా చూసుకోవాలి. నా బాధ్యతలు కూడా తీసుకోవాలి అని తెలిపింది. మరి జ్యోతి రెండో పెళ్లి ఎవర్ని చేసుకుంటుందో చూడాలి.

Also Read : Rajamouli : ఎంత మాటన్నావు రాజమౌళి.. హనుమంతుడి మీద అలా.. ఏకిపారేస్తున్న నెటిజన్లు..