Killer Song : జ్యోతి పూర్వజ్ ‘కిల్లర్’ స్టైలిష్ సాంగ్ చూశారా..? ఫైర్ & ఐస్..
తాజాగా ఈ సినిమా నుంచి ఫైర్ అండ్ ఐస్ అనే స్టైలిష్ సాంగ్ ను రిలీజ్ చేసారు.(Killer Song)
Killer Song
Killer Song : సీరియల్స్ తో పాపులర్ అయిన జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా పూర్వజ్, మనీష్ గిలాడ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా ‘కిల్లర్’. ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మాణంలో పూర్వజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి ఫైర్ అండ్ ఐస్ అనే స్టైలిష్ సాంగ్ ను రిలీజ్ చేసారు.(Killer Song)
మీరు కూడా ఈ సాంగ్ చూసేయండి..
యాక్షన్ కొరియోగ్రాఫర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. జ్యోతి గారు యాక్షన్ తెలియదు అనేవాళ్ళు. మేము 15 మందితో అటాక్ చేసే యాక్షన్ సీక్వెన్స్ ని 3 గంటలు రెడీ చేస్తే జ్యోతి గారు వచ్చి అరగంటలో మొత్తం యాక్షన్ చేశారు. మేము షాక్ అయ్యాం. ఈ సినిమాలో జ్యోతి గారు చేసే యాక్షన్ సీక్వెన్సులకు జనాలు ఆశ్చర్యపోతారు అని అన్నారు.
Also Read : Nani Kasaragadda : తండ్రి మరణం.. చెల్లి సపోర్ట్ తో సక్సెస్ కొట్టిన కొడుకు.. స్టేజిపై ఎమోషనల్..
నిర్మాత పద్మనాభరెడ్డి.ఎ. మాట్లాడుతూ.. పూర్వజ్ ను ఇంట్రడ్యూస్ చేసినందుకు నేను గర్వపడుతున్నా. తనతో కెరీర్ ప్రారంభించిన వారందరినీ తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటాడు. ఈ పాటలో చూపించినట్లు ఫైర్, ఐస్ తనలో ఉన్నాయి అన్నారు.
హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ.. నేను డాక్టర్ అవ్వాలనుకున్నా కానీ ఐటీ కంపెనీలో వర్క్ చేయాల్సివచ్చింది. ఆ తర్వాత సీరియల్స్ తో పాపులర్ అయ్యాను. ఇప్పుడు హీరోయిన్ గా మీ ముందుకు వస్తున్నాను. యాక్టర్ అయ్యాక మంచి స్టంట్స్ తో యాక్షన్ మూవీ ఒకటి చేయాలని ఉందని పూర్వజ్ కు చెప్తే ఈ స్క్రిప్ట్ రెడీ చేసాడు అని తెలిపింది.

డైరెక్టర్ పూర్వజ్ మాట్లాడుతూ.. మేము చేసిన కిల్లర్ సినిమా కొత్త ప్రయత్నంగా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. జ్యోతి పూర్వజ్ ఈ సినిమాలో స్పై, వాంపైర్, సూపర్ షీ, టెర్రరిస్ట్, రక్షా రై.. ఇలా ఐదు భిన్నమైన పాత్రల్లో అద్భుతంగా నటించింది.ఈ సినిమా చిత్ర కథకు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఎలిమెంట్స్ ముడిపడి ఉంటాయి. ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఇది. ఇప్పటిదాకా మీరు చూసింది 3 పర్సెంట్ మాత్రమే. మిగతా కంటెంట్ సర్ ప్రైజింగ్ గా ఉంటుంది అని అన్నారు.
Also Read : Akhanda 2 : ‘అఖండ 2’ జాజికాయ జాజికాయ సాంగ్ వచ్చేసింది.. బాలయ్య బాబు స్టెప్స్ అదుర్స్..
