K Raghavendra Rao : సీతారామం 2 ప్లాన్ చేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న రాఘవేంద్రరావు..

సీతారామంకి సీక్వెల్ వస్తే బాగుండు అని ఎంతోమంది అనుకుంటుంటారు. ఇప్పుడు అలా అనుకునే వారిలో మన టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా జాయిన్ అయ్యారు. సీతారామంకి..

K Raghavendra Rao : సీతారామం 2 ప్లాన్ చేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న రాఘవేంద్రరావు..

K Raghavendra Rao says he wants Sita Ramam sequel

Updated On : May 9, 2023 / 3:22 PM IST

K Raghavendra Rao : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika Mandanna) ఒక కీలక పాత్రలో కనిపించింది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రతి ఒక్కరి మనసు దోచుకొని ఎంతటి హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుండు అని ఎంతోమంది అనుకుంటుంటారు.

Rajasthan Royals – RRR : తొక్క తీస్తా.. రాజస్తాన్ రాయల్స్ టీంకి.. RRR నిర్మాత కౌంటర్..

ఇప్పుడు అలా అనుకునే వారిలో మన టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా జాయిన్ అయ్యారు. సీతారామం సినిమాని నిర్మించిన స్వప్న సినిమా బ్యానర్ ‘అన్ని మంచి శకునములే’ అనే మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. తాజాగా ఈ మూవీ సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరగగా.. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు హాజరయ్యారు. ఇక ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. సీతారామం 2 ప్లాన్ చేయండి అంటూ స్వప్న నిర్మాణ సంస్థను కోరాడు.

Pawan Kalyan OG : మహారాష్ట్రలో జనసైనికులతో పవన్.. OG లుక్ అదిరిపోయిందిగా!

సీతారామం సినిమాలో సీత ఒంటరిగా మిగిలిపోవడం తలుచుకుంటే తనకి ఇప్పటికి కన్నీళ్లు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చాడు. రామ్ చనిపోకుండా ఎక్కడో ఉన్నాడని, అది సీతకి తెలిసేలా సీతారామం 2 ప్లాన్ చేయమని సలహా ఇచ్చాడు. మరి దర్శకేంద్రుడు అడిగిన తరువాత చిత్ర యూనిట్ ఏమన్నా ఆలోచన చేస్తుందా? సీక్వెల్ ని ప్లాన్ చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే. కాగా ఆ సినిమా చివరిలో రామ్ పాకిస్తాన్ లో చనిపోయాడంటూ చూపించిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయాన్ని ఒక లెటర్ ద్వారానే సీతకి, ప్రేక్షకులకు తెలియజేశారు. ఒకవేళ ఆ లెటర్ లో రాసినట్లు రామ్ చనిపోకుండా ఎక్కడో బ్రతికే ఉంటే, ఆ విషయం రష్మిక పాత్ర ద్వారా సీతకి తెలిస్తే.. ఆ తరువాత జరిగే కథనే సీతారామం 2 గా చూపించవచ్చుగా అని కొందరు సలహాలు కూడా ఇస్తున్నారు.