Kamal Haasan: విక్రమ్ ఎఫెక్ట్ ఇండియన్-2పై చూపిస్తోన్న కమల్..?

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన రీసెంట్ మూవీ ‘విక్రమ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో కమల్ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Kamal Haasan: విక్రమ్ ఎఫెక్ట్ ఇండియన్-2పై చూపిస్తోన్న కమల్..?

Kamal Haasan Hikes Remuneration Huge For Indian 2

Updated On : September 26, 2022 / 12:30 PM IST

Kamal Haasan: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన రీసెంట్ మూవీ ‘విక్రమ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ చెలరేగిపోయి నటించాడు. ఈ సినిమాతో చాలా కాలం తరువాత బాక్సాఫీస్ వద్ద కమల్ ఈ రేంజ్‍‌లో గ్రాండ్ విక్టరీ అందుకోవడంతో ఆయన అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు.

Kamal Haasan: ఇండియన్-2 కోసం 14 భాషల్లో దుమ్ములేపిన కమల్ హాసన్..?

ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో కమల్ తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా అదే జోష్‌లో చేయాలని చూస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్-2 సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా కోసం కమల్ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విక్రమ్ గ్రాండ్ విక్టరీ కావడంతోనే కమల్ ఈ మేరకు తన రెమ్యునరేషన్‌ను పెంచాడని తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇండియన్-2 సినిమా కోసం కమల్ ఏకంగా రూ.150 కోట్ల వరకు రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడట.

Kamal Haasan : ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ తో నా అప్పులన్నీ తీర్చేస్తా..

తమిళంలో ఈ రేంజ్‌లో ఏ హీరో కూడా ఇప్పటివరకు రెమ్యునరేషన్ తీసుకోలేదని, ఇది కేవలం కమల్ హాసన్‌కే సాధ్యమైందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తమిళ హీరోల్లో ఇప్పటివరకు రజినీకాంత్ రూ.110 కోట్ల నుండి రూ.120 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకుంటుండగా, విజయ్ రూ.130 కోట్లు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఇండియన్-2 సినిమాతో వారందరినీ కమల్ దాటేశాడని కోలీవుడ్ చెబుతోంది. ఏదేమైనా విక్రమ్ సక్సెస్‌ను కమల్ ఇలా క్యాష్ చేసుకుంటున్నాడని.. అందులో ఎలాంటి తప్పులేదని కమల్ అభిమానులు అంటున్నారు. ఇక ఇండియన్-2 చిత్రంలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.