Kangana Ranaut : బాలీవుడ్ లో పాలిటిక్స్, ప్రియాంక చోప్రా బ్యాన్ పై.. ప్రియాంక, కంగనా సంచలన వ్యాఖ్యలు..

తాజాగా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తాను వినిపించిన ఓ పాడ్ కాస్ట్ లో బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో కొంతమంది కావాలని...................

Kangana Ranaut : బాలీవుడ్ లో పాలిటిక్స్, ప్రియాంక చోప్రా బ్యాన్ పై.. ప్రియాంక, కంగనా సంచలన వ్యాఖ్యలు..

Kangana Ranaut and Priyanka Chopra sensational comments on Bollywood

Updated On : March 28, 2023 / 7:49 PM IST

Kangana Ranaut :  బాలీవుడ్(Bollywood) లో కొంతమంది నెపోటిజం(Nepotism) ని ఎంకరేజ్ చేస్తూ కష్టపడి పైకి వచ్చేవాళ్ళని తొక్కేస్తూ ఉంటారని రెగ్యులర్ గా ఎవరో ఒకరు అంటూనే ఉంటారు. ఇక బాలీవుడ్ మాఫియా అంటూ పలువురు బాలీవుడ్ ప్రముఖుల్ని విమర్శిస్తారు. కంగనా లాంటి హీరోయిన్స్ అయితే బాలీవుడ్ మాఫియా అంటూ రెగ్యులర్ గా వాళ్లపై విరుచుకుపడుతూ, వాళ్ళు చేసే పనులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

బాలీవుడ్ లో జరిగే సంఘటనలపై కొంతమంది బహిరంగంగానే మాట్లాడతారు. బాలీవుడ్ లో కొత్తవాళ్ళని తొందరగా ఎదగనివ్వరని, మహిళలని కమిట్మెంట్ అడుగుతారని, సినిమాల్లోంచి వాళ్లకు నచ్చకపోతే తీసేస్తారని.. ఇలా అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తాను వినిపించిన ఓ పాడ్ కాస్ట్ లో బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో కొంతమంది కావాలని నన్ను సైడ్ చేశారు. కొంతమంది టార్గెట్ చేసి నన్ను మూలకు నెట్టేసి ఛాన్సులు రాకుండా చేశారు. బాలీవుడ్ లో ఉన్న పాలిటిక్స్ లో నేను ఇమడలేకపోయాను. అందుకే అమెరికాకు వచ్చేసి ఇక్కడే సినిమాలు చేస్తున్నాను అని కామెంట్స్ చేసింది. దీంతో ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Samantha : ఒకసారి రిలేషన్ బ్రేకప్ అయినంత మాత్రాన నేను అలా మారిపోను..

ఇక ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలని తీసుకొని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. కంగనా ప్రియాంక చోప్రా అన్న వ్యాఖ్యలకు సంబంధించిన న్యూస్ ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ఇది ప్రియాంక చోప్రా చెప్పింది. కొంతమంది కలిసి, ప్రియాంక చోప్రాని బెదిరించి ఆమెని ఇక్కడి సినిమా పరిశ్రమ నుండి వెళ్లిపోయేలా చేశారు. ఒక కష్టపడి పైకి వచ్చిన మహిళని భారతదేశం నుండి వదిలి వెళ్లిపోయేలా చేశారు. అందరికి తెలుసు కరణ్ జోహార్ ప్రియాంక చోప్రాని బ్యాన్ చేశాడని, మీడియా కూడా కరణ్, అతని మాఫియా చెప్పినట్టు ప్రియాంక మీద చాలా నెగిటివ్ వార్తలు రాసి ఆమె ఇండియాని వదిలి వెళ్లేలా చేశారు. ఇలాంటి అసహ్యకరమైన పనులు చేసేవారు వాటికి బాధ్యత వహించాల్సి వస్తుంది అంటూ సీరియస్ ట్వీట్స్ చేసింది.