మా అక్క నీ కొవ్వు కరిగించేస్తుంది : హృతిక్‌కి కంగన చెల్లి స్ట్రాంగ్ వార్నింగ్

అక్క సినిమా విడుదల విషయంలో నెలకొన్న వివాదం గురించి హృతిక్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కంగనా రనౌత్ చెల్లెలు రంగోలీ..

  • Published By: sekhar ,Published On : May 9, 2019 / 08:08 AM IST
మా అక్క నీ కొవ్వు కరిగించేస్తుంది : హృతిక్‌కి కంగన చెల్లి స్ట్రాంగ్ వార్నింగ్

Updated On : May 9, 2019 / 8:08 AM IST

అక్క సినిమా విడుదల విషయంలో నెలకొన్న వివాదం గురించి హృతిక్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కంగనా రనౌత్ చెల్లెలు రంగోలీ..

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, నటి కంగనా రనౌత్ మధ్య గతకొద్ది రోజులుగా ఘర్షణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి అక్క కంగన తరపునుండి చెల్లెలు రంగోలీ రంగంలోకి దిగింది.. అక్క సినిమా విడుదల విషయంలో నెలకొన్న వివాదం గురించి  హృతిక్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. హృతిక్ నటిస్తున్న’ సూపర్ 30′, కంగన ‘మెంటల్ హై క్యా’ సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవబోతున్నాయి. (జూలై 26) అసలే ఎప్పటినుండో గొడవలు అవుతున్నాయి, మళ్ళీ కొత్త గొడవ ఎందుకులే అని.. కంగన, మెంటల్ హై క్యా నిర్మాత ఏక్తా కపూర్‌ని సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తే, ఆమె ఒప్పుకోలేదు..

దీంతో హృతిక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కంగనపై కామెంట్స్ చేస్తున్నారు. దీని గురించి నిర్మాత ఏక్తా కపూర్ ట్విట్టర్ ద్వారా స్పందించింది. ‘ఎవరికివారు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ చెయ్యాలనేది నిర్మాతగా నా నిర్ణయం.. అందరితో మాట్లాడాకే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసాను.. సో, ఎవరూ కామెంట్స్ చెయ్యకండి’ అంటూ ఏక్తా ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్‌ని ట్యాగ్ చేస్తూ కంగన సోదరి రంగోలీ రెచ్చిపోయింది.

మెంటల్ హై క్యా సినిమాని జూలై 26న రిలీజ్ చెయ్యొద్దని కంగన ఏక్తాని రిక్వెస్ట్ చేసింది.. బట్, ఆమె ఒప్పుకోలేదు.. దానికి కంగన ఏం చేస్తుంది.. ఏక్తా హృతిక్‌కి చైల్డ్ హుడ్ ఫ్రెండ్.. అతనితో మాట్లాడాకే ఆమె రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది.. డైరెక్ట్‌గా ఏమీ అనలేక చాటుగా మాట్లాడుతున్నారు. మా అక్క జోలికొస్తే పద్దతిగా ఉండదు.. చూస్తూ ఉండు, కంగన నిన్నేం చేస్తుందో.. నువ్వు మా అక్కని టార్చర్ పెట్టాలనుకుంటే తను నీ కొవ్వు కరిగించేస్తుంది.. తనకి అన్యాయం జరగనంత వరకు సూపర్ 30 సినిమా గురించి కానీ, ఆ మూవీ టీమ్ గురించి కానీ తను ఒక్క మాటకూడా మాట్లాడదు.. అంటూ హృతిక్‌పై ఫైర్ అయ్యింది రంగోలీ.