బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతా సస్పెండ్
వరుస వివాదాస్పద ట్వీట్ల నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అయింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వరుస ట్వీట్లలో నటి అభ్యంతరకరమైన

Kangana Ranaut
Kangana Ranaut : వరుస వివాదాస్పద ట్వీట్ల నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అయింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వరుస ట్వీట్లలో నటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం (మే 2) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత రాష్ట్రంలో జరిగిన హింసకు నటి మమతా బెనర్జీని నిందిస్తూ.. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.. అంతేకాదు మమతను రాక్షసుడితో పోల్చడంతో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి ఆమె ఖాతాను సస్పెండ్ చేశారు.