బడా నిర్మాత కూతురికి కరోనా..
బాలీవుడ్ నటి, మోడల్ జోయా మొరానీకి కరోనా పాజిటివ్ వచ్చింది..

బాలీవుడ్ నటి, మోడల్ జోయా మొరానీకి కరోనా పాజిటివ్ వచ్చింది..
కరోనా మహమ్మారి ప్రజలను రోజురోజుకీ కలవరపెడుతోంది. బాలీవుడ్ సింగర్ కనికాకపూర్ అయిదుసార్లు పాజిటివ్ వచ్చిన తర్వాత కరోనా నుంచి బయటపడిన విషయం తెలిసిందే. మరోనటి అంకితా లోఖండే నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తికి పాజిటివ్ రావడంతో దెబ్బకి అపార్ట్‌మెంట్‌కి సీల్ వేశారు.
ఇంతలోనే బడా నిర్మాత కూతురుకు కరోనా సోకిన విషయం బాలీవుడ్ వారికి షాక్ ఇచ్చింది. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘రావన్’ వంటి సినిమాల నిర్మాత, హీరో షారుఖ్ ఖాన్ క్లోజ్ ఫ్రెండ్ కరీం మొరానీ కూతురు షాజా జరానీను అస్వస్థతగా ఉందని ఆసుపత్రికి వెళ్లగా అక్కడ ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది.
ప్రస్తుతం ఆమె ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. మరోవైపు ముంబైలోని జుహు ప్రాంతంలో నివసిస్తున్న కరీం మొరానీ కుటుంబం పద్నాలుగు రోజులపాటు స్వీయ నిర్బంధం విధించుకుంది.
Read Also : సుమ ఇంట విషాదం.. రాజీవ్ కనకాల చెల్లెలు హఠాన్మరణం..