Karthik Raju : అట్లాస్ సైకిల్.. అత్తగారు పెట్లే.. అంటున్న హీరో కార్తీక్ రాజు..
కౌసల్యా కృష్ణమూర్తి, అథర్వ లాంటి సినిమాలతో మెప్పించిన కార్తిక్ రాజు తాజాగా కొత్త సినిమా మొదలుపెట్టాడు.

Karthik Raju Kajal Chowdary Atlas Cycle Attagaaru Petle Movie Launched
Karthik Raju : కౌసల్యా కృష్ణమూర్తి, అథర్వ లాంటి సినిమాలతో మెప్పించిన కార్తిక్ రాజు తాజాగా కొత్త సినిమా మొదలుపెట్టాడు. కార్తిక్ రాజు, అనగనగా ఫేమ్ కాజల్ చౌదరి జంటగా తెరకెక్కిస్తున్న సినిమా ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’. శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ పై గాలి కృష్ణ నిర్మాణంలో రాజా దుస్సా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
తాజాగా ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ సినిమా పూజ కార్యక్రమం రామా నాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, డైరెక్టర్స్ భీమనేని శ్రీనివాస రావు, క్రాంతి మాధవ్.. పలువురు గెస్టులుగా హాజరయ్యారు. తమ్మారెడ్డి భరద్వాజ స్క్రిప్ట్ అందచేయగా సురేష్ బాబు క్లాప్ కొట్టారు. తొలి షాట్ కి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.
Also Read : Game Changer : వామ్మో.. ‘గేమ్ ఛేంజర్’ సినిమా నిడివి 7 గంటలపైనే.. ఎడిటర్ సంచలన వ్యాఖ్యలు..
పూజ కార్యక్రమం అనంతరం రాజా దుస్సా మాట్లాడుతూ.. ఇది కామెడీ, ఎమోషన్ తో కూడిన పీరియాడికల్ సినిమా. 1980లో వరంగల్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా చేస్తున్నాం. కార్తిక్ రాజు, కాజల్ చౌదరి జంటగా త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది అని తెలిపారు. హీరో కార్తిక్ రాజు మాట్లాడుతూ.. 80వ దశకంలో జరిగే కథతో ఈ సినిమా రాబోతోంది. కాజల్ చౌదరి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఆమెతో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉంది. ఇంత మంచి కథను నాకు ఇచ్చిన డైరెక్టర్ రాజా దుస్సా, నిర్మాత గాలి కృష్ణ గారికి ధన్యవాదాలు అని తెలిపాడు.

కాజల్ చౌదరి మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం నా మీద ఎంతో ప్రేమను కురిపిస్తున్నారు. ఈ సినిమాతో కూడా త్వరలో మీ ముందుకు వచ్చి మెప్పిస్తాను అని తెలిపింది.