Karthika Deepam 2: టైం అండ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కార్తీకదీపం 2.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వంటలక్క, డాక్టర్ బాబుకి హారతులు..

కార్తీకదీపం 2 సీరియల్ ప్రసారం అవ్వడానికి టైం అండ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.

Karthika Deepam 2: టైం అండ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కార్తీకదీపం 2.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వంటలక్క, డాక్టర్ బాబుకి హారతులు..

Karthika Deepam 2 serial telecast date and time details

Updated On : March 21, 2024 / 8:36 PM IST

Karthika Deepam 2: తెలుగు తెలివిజన్ చరిత్రలో “కార్తీకదీపం” ఒక సువర్ణాధ్యాయం. స్టార్ మా సృష్టించిన ఈ సంచలనం భారతదేశ స్థాయిలో అద్భుతమైన రేటింగ్స్ సాధించి ఆశ్చర్యపరిచింది కార్తీకదీపం సీరియల్ లో పాత్రలు సంతోష పడితే తెలుగు లోగిళ్ళు ఆనందించాయి. ఆ పాత్రలు బాధపడితే వాళ్ళకంటే ఎక్కువగా కన్నీళ్లు పెట్టుకున్నారు. డాక్టర్ బాబు, దీప కేవలం బుల్లితెర పైన కనిపించే రెండు పాత్రలు మాత్రమే కాదు. ప్రతి తెలుగు ఇంట్లో ఉండే ఇద్దరు మనుషులు. అలాంటి “కార్తీకదీపం” సీరియల్ ఇప్పుడు మళ్ళీ స్టార్ మా లో రాబోతోంది.

సీక్వెల్ తో రాబోతున్న ఈ సీరియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో ప్రేమ విశ్వనాథ్ అలియాస్ వంటలక్క, నిరుపమ్ పరిటాల అలియాస్ డాక్టర్ బాబు పాల్గొన్నారు. ఇక వీరిద్దరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగు ఆడవాళ్లు హారతి ఇచ్చి తమ అభిమానాన్ని చూపించారు. ఈ కార్తీక దీపం 2 సీరియల్ ని స్టార్ మాలో మార్చి 25 నుంచి ప్రతివారం సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు ప్రసారం చేయబోతున్నారు.

Also read : Matka : అతడి జీవిత ఆధారంగా వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీ.. అదే కథతో అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ప్రకటన..

ఇక ఈ ఈవెంట్ లో డాక్టర్ బాబు మాట్లాడుతూ.. “కార్తీక దీపం ఫస్ట్ సీజన్ నెంబర్ వన్ సీరియల్ అనిపించుకుంది. అప్పట్లో ప్రజాభిమానానికి కొలమానమైన బార్క్.. ఈ సీరియల్ తెలుగువాళ్లు ఎంతగానో ఇష్టపడి చూసిన సీరియల్ అని లెక్కల్లో తేల్చి చెప్పింది. జాతీయ స్థాయిలో రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్ ని అద్భుతంగా చూపించి, ఫామిలీ డ్రామాని గొప్పగా పండించిన మొట్టమొదటి తెలుగు సీరియల్ కార్తీక దీపం” అని వ్యాఖ్యానించారు

వంటలక్క మాట్లాడుతూ.. “నేను ఎక్కువగా కన్నీళ్లు పెడతాను అని చాలామంది అన్నారు. నన్ను ఆశీర్వదించిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఓసారి వెనక్కి తిరిగి చూస్తే.. ఈ కార్తీక దీపం సీరియల్ ని మీకు ఎంతో ఇష్టమైన సీరియల్ గా మార్చిన ప్రతి క్షణాన్ని, ప్రతి జ్ఞాపకాన్ని గుర్తుకు వస్తుంది” అంటూ పేర్కొన్నారు.

Karthika Deepam 2 serial telecast date and time details Karthika Deepam 2 serial telecast date and time details Karthika Deepam 2 serial telecast date and time details