టాలీవుడ్‌పై సీఎం కేసీఆర్ వరాల జల్లు..

  • Published By: sekhar ,Published On : November 23, 2020 / 03:16 PM IST
టాలీవుడ్‌పై సీఎం కేసీఆర్ వరాల జల్లు..

Updated On : November 23, 2020 / 5:03 PM IST

KCR – Telangana Movie Theatres: సినిమా పరిశ్రమ అలాగే థియేటర్ వర్గాల వారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో పలు అంశాల గురించి మాట్లాడిన కేసీఆర్ చిత్ర పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.


థియేటర్ల యాజమాన్యం వారి అభ్యర్థన మేరకు, మినిమం డిమాండ్ ఛార్జెస్ ఉన్న కమర్షియల్ ఆర్గనైజేషన్స్ (ఈ లిస్టులో సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి) మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా గల సినిమా హాళ్లకు విద్యుత్ బిల్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.


అలాగే రూ.10 కోట్ల బడ్జెట్ లోపు నిర్మించే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్ ఇస్తామని చెప్పారు. థియేటర్లలో షోలు పెంచుకునేందుకు అనుమతినిస్తామన్నారు. టికెట్ రేట్లు సవరించేందుకు వెసులుబాటు కల్పిస్తామన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీల పట్ల చిత్ర పరిశ్రమ మరియు థియేటర్ల యాజమాన్య సంఘాల వారు హర్షం వ్యక్తం చేశారు.