RRR : ‘లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్’ అవార్డుని అందుకున్న కీరవాణి..

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికి తెలుసు. ఈ సినిమా ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. కాగా మరో ఇంటర్నేషనల్ అవార్డ్స్ అయిన 'లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్'లో ఆర్ఆర్ఆర్ సినిమా పలు క్యాటగిరీలో ఎంపిక అయ్యింది. అయితే ఈ రేస్ లో ఎం ఎం కీరవాణి 'బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్’గా అవార్డుని అందుకున్నాడు.

RRR : ‘లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్’ అవార్డుని అందుకున్న కీరవాణి..

Keeravani receiving Los Angeles Film Critics Award

Updated On : January 15, 2023 / 4:49 PM IST

RRR : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికి తెలుసు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ భారీ మల్టిస్టార్రర్ చిత్రం హాలీవుడ్ ఆడియన్స్, సినీ దర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కేవలం ప్రజాధారణ పొందడమే కాకుండా అంతర్జాతీయ అవార్డుల వేదికల్లో స్థానం దక్కించుకుంటూ చరిత్ర సృష్టిస్తుంది. ఈ సినిమా ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రతిష్టాత్మక పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకొని రికార్డు క్రియేట్ చేసింది.

Rajamouli : హృతిక్ రోషన్ గురించి నేను మాట్లాడింది తప్పే.. రాజమౌళి!

కాగా మరో ఇంటర్నేషనల్ అవార్డ్స్ అయిన ‘లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్’లో ఆర్ఆర్ఆర్ సినిమా పలు క్యాటగిరీలో ఎంపిక అయ్యింది. అయితే ఈ రేస్ లో ఎం ఎం కీరవాణి ‘బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్’గా అవార్డుని అందుకున్నాడు. ఈ అవార్డుని గత ఏడాది డిసెంబర్ లోనే ప్రకటించింది అసోసియేషన్. తాజాగా ఈ అవార్డుని కీరవాణి లాస్ ఏంజెల్స్ లో అందుకున్నాడు. ఈ విషయాన్ని RRR టీం ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట షేర్ చేయడంతో.. నెటిజెన్లు కీరవాణికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ అవార్డుతో కీరవాణి రెండు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా లాస్ ఏంజెల్స్ అవార్డ్స్ రేస్ లో రాజమౌళి కూడా బెస్ట్ డైరెక్టర్ గా నామినేట్ అయ్యాడు. అయితే రాజమౌళి రన్నర్ అప్ గా నిలిచాడు. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లోనే ఉన్న మూవీ టీం.. ఆస్కార్ నామినేషన్ లిస్ట్ లో చోటు దక్కించుకునేందుకు క్యాంపెన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్స్ తో చిట్ చాట్ నిర్వహిస్తూ, పలు మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ హాలీవుడ్ సిటీలో సందడి చేస్తున్నారు.