Dasara Movie: వెన్నెల మాస్ డ్యాన్స్.. వావ్ అంటోన్న కీర్తి సురేష్ ఫ్యాన్స్!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్న తాజా చిత్రం ‘దసరా’. ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించారు. ఇక వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది.

Dasara Movie: వెన్నెల మాస్ డ్యాన్స్.. వావ్ అంటోన్న కీర్తి సురేష్ ఫ్యాన్స్!

Keerthy Suresh Mass Dance As Vennela In Dasara Movie Released

Dasara Movie: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్న తాజా చిత్రం ‘దసరా’. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించగా, కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా రిలీజ్ రోజునే అదిరిపోయే రెస్పాన్స్‌ను తెచ్చుకోవడంతో, ప్రస్తుతం థియేటర్లలో దుమ్ములేపుతోంది.

Dasara Movie: దసరా టీమ్ పై బొమ్మ బొంబాట్ అంటూ జక్కన్న ప్రశంసల వర్షం

ఇక ఈ సినిమాలో హీరోహీరోయిన్లు డీగ్లామర్ పాత్రల్లో నటించగా, వారి పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ధరణి పాత్రలో నాని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని అభిమానులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వెన్నెల పాత్రకు సంబంధించి ఓ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. వెన్నెలగా కీర్తి సురేష్ ఊరమాస్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను రిలీజ్ చేయగా ఆమె ఎనర్జీ చూసి అందరూ అవాక్కవుతున్నారు.

Dasara Movie: ‘దసరా’పై మహేష్ కామెంట్స్.. సాలిడ్ రిప్లై ఇచ్చిన నాని!

కంటిన్యూగా డ్యాన్స్ చేస్తూ కీర్తి సురేష్ చేసిన రచ్చ మామూలుగా లేదంటూ ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆమె ఎమోషన్స్‌ను పండించిన తీరు కూడా వారిని అమితంగా ఆకట్టుకుంది. కాగా, ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీత అందించగా, ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేశారు.