KRamp : ఆకట్టుకుంటున్న కిరణ్ అబ్బవరం ‘KRamp’ ఫస్ట్ లుక్..
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం కే-ర్యాంప్(K-RAMP).

Kiran Abbavaram KRamp First Look out now
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం కే-ర్యాంప్(K-RAMP). జైన్స్ నాని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యుక్తి తరేజా కథానాయిక. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మక్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి కిరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో కిరణ్.. మాస్ గెటప్‌లో కనిపిస్తున్నాడు. లుంగీ చేతులతో కాస్త పైకి పట్టుకుని స్టైల్‌గా ముందుకు నడుస్తూ కనిపిస్తున్నాడు. వెనుకవైపు ఫైర్ ఎఫెక్ట్‌లతో తయారైన హార్ట్ షేప్ బాటిల్స్ డెకరేషన్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది.
Allari Naresh : అల్లరి నరేష్ 63.. టైటిల్ ఇదే.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్..
Entertainment. Entertainment. Entertainment 😀@RealYukthi @JainsNani @RajeshDanda_ @HasyaMovies #KRampFirstLook #Kramp pic.twitter.com/WliLNIKGXf
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) June 30, 2025
మొత్తంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్‌గా మారింది. అయితే.. కొందరు మాత్రం ఇది ప్రభాస్ రాజాసాబ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కాపీ కొట్టినట్లుగా కనిపిస్తుందని అంటున్నారు.
ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కిరణ్ అబ్బవరం, చేతన్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ఇది. గతంలో వీరి కాంబో ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రాలు వచ్చాయి.
ఇక KRamp చిత్రం 2025 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.