Super Star Krishna : టాలీవుడ్ కి కొత్తదనాన్ని పరిచయం చేసి.. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు కృష్ణ..
టాలీవుడ్ రియల్ సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. కృష్ణ గారు తన 5 దశాబ్దాల సినీ కెరీర్ లో 350కి పైగా సినిమాల్లో నటించడమే కాకుండా, 16 సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. అంతేకాదు టాలీవుడ్ కి కొత్తదనాన్ని పరిచయం చేసి తెలుగు సినిమాని కొత్తదనం వైపు అడుగులు వేసేలా చేశారు.

Krishna became a trend setter by introducing something new to Tollywood
Super Star Krishna : టాలీవుడ్ రియల్ సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. నిన్న ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం వల్ల హైదరాబాద్ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన కృష్ణ.. ఈరోజు ఉదయం సుమారు 4 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. కృష్ణ గారి మరణంతో ఘట్టమనేని కుటుంబం, తెలుగు సినిమా ప్రపంచం శోకసంద్రంలో మునిగింది.
Krishna : తెలుగుతేరపై ఒక సినిమా జనరేషన్ పయనం ముగిసింది..
ఇక కృష్ణ గారు తన 5 దశాబ్దాల సినీ కెరీర్ లో 350కి పైగా సినిమాల్లో నటించడమే కాకుండా, 16 సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. అలాగే నిర్మాతగా పద్మాలయ స్టూడియోస్ స్థాపించి పలు చిత్రాలను నిర్మించారు. అంతేకాదు టాలీవుడ్ కి కొత్తదనాన్ని పరిచయం చేసి తెలుగు సినిమాని కొత్తదనం వైపు అడుగులు వేసేలా చేశారు.
ఫస్ట్ సోషల్ కలర్ – తేనేమనసులు
ఫస్ట్ జేమ్స్ బాండ్ – గూఢచారి 116
ఫస్ట్ కౌబాయ్ – మోసగాళ్లకు మోసగాడు
ఫస్ట్ ఈస్ట్ మ్యాన్ – ఈనాడు
ఫస్ట్ 70MM – సింహాసనం
ఫస్ట్ డిటిఎస్ – తెలుగు వీర లేవరా
ఫస్ట్ సినిమా స్కోప్ – అల్లూరి సీతారామరాజు
ఇలా డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకుంటూ తెలుగుతెరపై ఎన్నో ప్రయోగాలు చేసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు.