Krithi Shetty : ‘నాగ లక్ష్మీ’ గా కృతి శెట్టి..

‘బంగార్రాజు’ లో నాగ లక్ష్మీ క్యారెక్టర్ చేస్తున్న కృతి శెట్టి లుక్ రిలీజ్..

Krithi Shetty : ‘నాగ లక్ష్మీ’ గా కృతి శెట్టి..

Krithi Shetty

Updated On : November 18, 2021 / 10:42 AM IST

Krithi Shetty: కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న క్రేజీ ఫిలిం ‘బంగార్రాజు – సోగ్గాడు మళ్లీ వచ్చాడు’.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ కి ప్రీక్వెల్‌గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బంగార్రాజు’ లో రమ్యకృష్ణ, కృతి శెట్టి ఫీమేల్ లీడ్స్‌గా నటిస్తున్నారు. జీ5 సంస్థతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నాగార్జున నిర్మిస్తున్నారు.

Laddunda Song : ‘లగెత్తి కొడితే లడ్డుండా.. లడ్డుండా’ – నాగ్ భలే పాడాడుగా!

ఇటీవల రిలీజ్ చేసిన నాగార్జున ఫస్ట్‌లుక్, అలాగే ఆయన పాడిన ‘లడ్డుండా’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గురువారం ‘బంగార్రాజు’ లో నాగ లక్ష్మీ క్యారెక్టర్ చేస్తున్న కృతి శెట్టి లుక్ వదిలారు. ‘ఉప్పెన’ లో క్యూట్ లుక్‌తో ఆకట్టుకున్న కృతి, నాగలక్ష్మీ గెటప్‌లో చూడముచ్చటగా ఉంది.

Most Eligible Bachelor : 50 కోట్ల క్లబ్‌లో అయ్యగారి సినిమా!

ప్రస్తుతం మైసూర్‌లో ‘బంగార్రాజు’ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. సినిమాను ఎట్టి పరిస్థితిలో సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయారు కింగ్ నాగార్జున. అనూప్ రూబెన్స్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.