Kuberaa : వంద కోట్ల క్ల‌బ్‌లో ‘కుబేర‌’..

అక్కినేని నాగార్జున‌, ధ‌నుష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం కుబేర‌.

Kuberaa : వంద కోట్ల క్ల‌బ్‌లో ‘కుబేర‌’..

Kuberaa enter in hundred Crore club

Updated On : June 25, 2025 / 6:11 PM IST

అక్కినేని నాగార్జున‌, ధ‌నుష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం కుబేర‌. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే క‌లెక్ష‌న్లు సాధిస్తోంది. జూన్ 20న‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూకుపోతుంది. తాజాగా ఈ చిత్రం వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది.

విడుద‌లైన ఐదు రోజుల్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు సాధించిన‌ట్లు చిత్ర బృందం ఓ స‌రికొత్త పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది.

Hombale Films : హోంబలే ఫిల్మ్స్ ఒకేసారి 7 సినిమాల ప్రకటన.. 2037 వరకు.. కల్కి 1, కల్కి 2 కూడా.. ఫుల్ లిస్ట్ ఇదే..

ర‌ష్మిక మంధాన క‌థానాయిక‌గా న‌టించగా దేవీ శ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.