లైన్ క్లియర్: థియేటర్‌లలో లక్ష్మీ’స్ ఎన్‌టీఆర్.. ఫస్ట్ టాక్ ఇదే!

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీ’స్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ సినిమాను ఏప్రిల్ 3న స్వయంగా చూస్తామని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, అప్పటివరకు సినిమా విడుదలను ఆపాలంటూ నిర్మాతకు నోటీసులు జారీ చేసింది.
Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ
ఈ క్రమంలో శుక్రవారం విడుదల కావలసిన సినిమా ఆగిపోయింది. అయితే ఈ సినిమాను ఏపీలో విడుదల చేయనప్పటికీ తెలంగాణ, ఓవర్‌సీస్‌లో మాత్రం శుక్రవారం(29 మార్చి 2019) సినిమాను విడుదల చేస్తుంది చిత్ర యూనిట్. ఈ క్రమంలో థియేటర్‌లలో లక్ష్మీ’స్ ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతుంది.
ఇప్పటికే ఓవర్సీస్‌లో విడుదలైన ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. చంద్రబాబు పాత్రతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కించ పరిచేలా కొన్ని సీన్లు ఉన్నాయని.. అవి చూస్తే కచ్చితంగా రచ్చ జరుగుతుందని అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా చెబుతున్నారు.
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష
ఫస్టాఫ్ అంతా కేవలం ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి మధ్య వచ్చే సన్నివేశాలతోనే సాగిపోగా.. సెకెండాఫ్ వెన్నుపోటు అంశాన్ని చూపిస్తూ.. క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ నిజమైన అంత్యక్రియల విజువల్స్ వేసి సెంటిమెంట్ పండించాడని అంటున్నారు. ఇక సినిమాలో లక్ష్మీ పార్వతిని మరీ అమాయకంగా వర్మ చూపించారని అంటున్నారు.
Read Also : ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు బ్రేక్