డై హార్డ్ ఫ్యాన్ : లతా మంగేష్కర్ కోసం బ్రహ్మచారిగా మిగిలిపోయాడు

సాధారణంగా ప్రముఖులందరికీ అభిమానులు ఉంటారు. కానీ లైఫ్ అంతా వారికోసమే బ్రతకాలనుకునే వారు కొంతమందే ఉంటారు. అయితే ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ కు కూడా అలాంటి ఓ డై హార్డ్ ఫ్యాన్ ఉన్నాడు. ఆమె మీద అభిమానంతో తన ఇంటినే లతా మంగేష్కర్ మ్యూజియంలా మార్చేశాడు. అంతేకాదు జీవితాంతం ఆమె కోసం బ్రహ్మచారిగా ఉండిపోయాడు. అవునండి ఇది నిజం.
వివరాలు.. సాధారణంగానే లతా మంగేష్కర్‌కు అభిమానులు చాలా మందే ఉంటారు. కానీ ఇలాంటి అభిమానాన్ని మీరెక్కడా చూసుండరు. మీరట్ కు చెందిన గౌరవ్ శర్మ అనే వ్యక్తి లతా మంగేష్కర్ కు వీరఅభిమాని.. ఆమె పాడిన పాటలను, దేశవిదేశాల్లో ఆమె మీద వచ్చిన పుస్తకాలను కలెక్ట్ చేశాడు. అలా ఆమెకు సంబంధించి ప్రతీది సేకరించి మొత్తం తన ఇంటినే లతా మంగేష్కర్ మ్యూజియంగా మార్చేశాడు.
అంతేకాకుండా లతా మంగేష్కర్ మీద ఉన్న అభిమానంతో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీని గురించి గౌరవ్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచి లతాజీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం. నాతో పాటు ఆమె మీద నా అభిమానం కూడా పెరిగి పెద్దవసాగింది. నా జీవితం అంతా ఆమెని ఆరాధించడానికే సరిపోతుంది. ఆమె నా గురువు, దైవం. నేను ఆమెకు శిష్యుడిని, భక్తుడిని. ఇక వేరే స్త్రీకి నా హృదయంలో చోటు లేదు’ అని తెలిపారు.