RRR : ఆస్కార్ స్టేజి పై నాటు నాటు సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది ఎవరో తెలుసా?

మార్చి 12న ఈ ఆస్కార్ అవార్డుల వేడుకలో నాటు నాటు సాంగ్ డాన్స్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉండబోతుందని తెలిసిన దగ్గర నుంచి.. ఈ పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ అండ్ చరణ్ ఇవ్వబోతున్నారా? అనే ఒక క్యూరియాసిటీ మొదలయింది. తాము పర్ఫార్మ్ చేయడం లేదని ఇటీవల ఎన్టీఆర్ తేల్చి చెప్పేశాడు. అయితే ఈ పర్ఫార్మెన్స్ ఎవరు..

RRR : ఆస్కార్ స్టేజి పై నాటు నాటు సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది ఎవరో తెలుసా?

Lauren Gottlieb to perform Naatu Naatu live on stage at the Oscars

Updated On : March 11, 2023 / 11:00 AM IST

RRR : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. ఇప్పటి వరకు పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని కైవసం చేసుకున్న ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు పోటీ పడుతుంది. మార్చి 12న ఈ అవార్డుల వేడుక జరగనుంది. కాగా ఈ వేడుకలో నాటు నాటు సాంగ్ డాన్స్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉండబోతుందని తెలిసిన దగ్గర నుంచి.. ఈ పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ అండ్ చరణ్ ఇవ్వబోతున్నారా? అనే ఒక క్యూరియాసిటీ మొదలయింది.

Rajamouli : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాజమౌళికి కీలక బాధ్యతలు..

అయితే ఇటీవల ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో దీని పై స్పందిస్తూ.. ఆస్కార్ వంటి స్టేజి పై పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కచ్చితమైన ప్రాక్టీస్ అవసరం. కానీ, మాకు రిహార్సల్స్ చేయడానికి సమయం కుదరలేదు అంటూ చెబుతూ తాము పర్ఫార్మ్ చేయడం లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో ఈ పర్ఫార్మెన్స్ ఎవరు ఇవ్వబోతున్నారంటూ మళ్ళీ సస్పెన్స్ నెలకుంది. తాజాగా దీని మీద క్లారిటీ వచ్చేసింది. అమెరికన్ డాన్సర్ అయిన ‘లారెన్ గోట్లిబ్’ ఆస్కార్ స్టేజి పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుందట. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.

RRR : ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చుపెట్టారు.. 8 సినిమాలు తీసి వాళ్ళ మొహాన కొడతాను.. RRR యూనిట్ పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

”నేను ఆస్కార్ వేదిక పై నాటు నాటు సాంగ్ ప్రదర్శన ఇస్తున్నాను. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను” అంటూ రాసుకొచ్చింది. ప్రముఖ అమెరికన్ డాన్స్ షో ద్వారా పాపులర్ అయిన ఈ భామ.. ప్రభుదేవా నటించిన హిందీ మూవీ ABCD మూవీ ద్వారా ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత బాలీవుడ్ లోని ప్రముఖ డాన్స్ షోలో కంటెస్టెంట్ గా, జడ్జిగా చేసింది. ఇప్పుడు ఆస్కార్ వేదిక పై వరల్డ్స్ ఫేమస్ సాంగ్ ని పర్ఫార్మ్ చేసే అవకాశం దక్కించుకుంది. కాగా ఇదే స్టేజి పై కీరవాణితో పాటు పాట పాడిన సింగర్స్ రాహుల్ సిప్లిగుంజ్, కాలభైరవ కూడా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Lauren Gottlieb (@laurengottlieb)