Trisha : పొన్నియిన్ సక్సెస్ తమిళ పొన్నుకి కలిసొచ్చింది.. అజిత్, ధనుష్ ప్రాజెక్ట్స్‌లో త్రిష..?
పొన్నియిన్ సెల్వన్ తో సక్సెస్ అందుకున్న త్రిష.. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా ఈ భామ..

Leo heroine Trisha got chance in Ajith Kumar and Dhanush movies
Trisha : సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ అమ్మడు హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి 10 ఏళ్ళ పైనే అవుతుంది. నార్త్ టు సౌత్ పలు భాషల్లో నటించిన త్రిష.. ఎక్కువగా తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. తెలుగులో అయితే బెస్ట్ యాక్ట్రెస్ గా ఏకంగా మూడు ఫిలిం ఫేర్ అవార్డులను (Film Fare Award) అందుకుంది. తన కెరీర్ లో త్రిష.. దాదాపు టాలీవుడ్ అండ్ కోలీవుడ్ లోని టాప్ స్టార్స్ అందరితో కలిసి పని చేసింది. ఇక ఇటీవల ఈ భామ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ లో (Ponniyin Selvan) నటించింది.
Balakrishna : NBK108 టైటిల్ అప్డేట్.. దర్శకుడు బాబీ అండ్ బోయపాటి మూవీ అప్డేట్స్ పై న్యూస్..
ఈ మూవీ సక్సెస్ తో త్రిష కెరీర్ కి మళ్ళీ బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది. ఈ సినిమా సమయంలో ఈ అమ్మడు ఆన్ స్క్రీన్ అండ్ అఫ్ స్క్రీన్ అందాలకు అభిమానులు ఫిదా అయ్యిపోయారు. మూవీ మేకర్స్ కూడా త్రిషతో మళ్ళీ సినిమా చేయాలనిపించి వరుస మూవీ అవకాశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) అండ్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ లియో (Leo) లో త్రిష హీరోయిన్ గా చేస్తుంది. తాజాగా ఇప్పుడు మరో ఇద్దరి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా త్రిష కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.
Ustaad Bhagat Singh : ఉస్తాద్ అప్డేట్ ఇచ్చిన పవన్ నిర్మాతలు.. కీలక షెడ్యూల్ కోసం భారీ సెట్..
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో (Ajith Kumar) కలిసి మళ్ళీ నటించేందుకు త్రిష సిద్ధమవుతుందని తెలుస్తుంది. దర్శకుడు మగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న అజిత్ సినిమాలో హీరోయిన్ గా త్రిషని కన్‌ఫార్మ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ధనుష్ (Dhanush) 50వ సినిమా కోసం కూడా త్రిషతో చర్చలు జరుపుతున్నారట. ఈ సినిమాని ధనుష్ డైరెక్ట్ చేయబోతున్నాడు. గతంలో ధనుష్ అండ్ త్రిష కలిసి ‘కోడి’ అనే సినిమాలో నటించారు.