Tunisha Sharma : తునీషా ఆత్మహత్యకి లవ్ బ్రేకప్ కారణం.. పోలీసులు!

20 ఏళ్ళ వయసులో బాలీవుడ్ సినీ మరియు టీవీ నటి ‘తునీషా శర్మ’ ఆత్మహత్య హిందీ పరిశ్రమలో కలకలం రేపింది. పోలీస్ ముందుగా ఈ కేసుని ఆత్మహత్యగా పరిగణించారు. అయితే సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరక్కపోవడంతో, హత్యకోణంలో దర్యాప్తు చేయడం కూడా మొదలుపెట్టారు. అయితే ఈ దర్యాప్తులో అసలు నిజం బయటపడింది.

Tunisha Sharma : తునీషా ఆత్మహత్యకి లవ్ బ్రేకప్ కారణం.. పోలీసులు!

Love breakup is the reason for Tunisha's suicide

Updated On : December 26, 2022 / 11:02 AM IST

Tunisha Sharma : 20 ఏళ్ళ వయసులో బాలీవుడ్ సినీ మరియు టీవీ నటి ‘తునీషా శర్మ’ ఆత్మహత్య హిందీ పరిశ్రమలో కలకలం రేపింది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ స్టార్ట్ చేసిన తునీషా.. అందం అభినయంతో బుల్లితెర నుంచి వెండితెర వరకు మంచి ఆఫర్లే అందుకుంటుంది. ప్రొఫెషనల్ కెరీర్ బాగానే ఉన్న సమయంలో తునీషా ఆత్మహత్య తోటి నటీనటలను దిగ్బ్రాంతికి లోనయ్యేలా చేసింది.

Tunisha Sharma : తునీషాది హత్య అంటున్న పోలీసులు!

శనివారం షూటింగ్‌లో సరదాగా పాల్గొన్న తునీషా, వెంటనే మేకప్ రూమ్‌లో ఉరువేసుకొని కనపడడం అందర్నీ కలిచివేసింది. అసలు ఏమి జరిగిందో తెలియక కంగారు పడుతున్నారు తోటి నటీనటులు. కాగా పోలీస్ ముందుగా ఈ కేసుని ఆత్మహత్యగా పరిగణించారు. అయితే సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరక్కపోవడంతో, హత్యకోణంలో దర్యాప్తు చేయడం కూడా మొదలుపెట్టారు.

అయితే ఈ దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. తునీషా తన కో యాక్టర్ షీజాన్ మహమ్మద్ ఖాన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అయితే 15 రోజులు క్రిందట వీరిద్దరికి బ్రేకప్ అయ్యింది. దీంతో తునీషా బ్రేకప్ ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రియుడు షీజాన్ ని పోలీసులు అరెస్ట్ చేసి నాలుగు రోజులు జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.