Lucky Baskhar : యూఎస్‌లోనూ అద‌ర‌గొడుతున్న ల‌క్కీ భాస్క‌ర్‌.. ఆ క్లబ్‌లో చేరిక‌

దుల్క‌ర్ స‌ల్మాన్, మీనాక్షి చౌదరి న‌టించిన మూవీ ల‌క్కీ భాస్క‌ర్‌.

Lucky Baskhar : యూఎస్‌లోనూ అద‌ర‌గొడుతున్న ల‌క్కీ భాస్క‌ర్‌.. ఆ క్లబ్‌లో చేరిక‌

Lucky Baskhar joins one million club in USA

Updated On : November 9, 2024 / 2:57 PM IST

Lucky Baskhar : దుల్క‌ర్ స‌ల్మాన్, మీనాక్షి చౌదరి న‌టించిన మూవీ ల‌క్కీ భాస్క‌ర్‌. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కింది. దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 31న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను సొంతం చేసుకుంటుంది. తాజాగా ఈ చిత్రం మ‌రో ఘ‌న‌త‌ను సాధించింది. ఓవ‌ర్సీస్‌లో వ‌న్ మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో చేరింది.

యూఎస్ మార్కెట్ లో కూడా ఈ చిత్రం అదరగొడుతోంది. అక్కడ ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ విష‌యాన్ని ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. దీపావ‌ళికి బ్లాక్ బాస్ట‌ర్ చిత్రం ల‌క్కీ భాస్క‌ర్ అని తెలిపింది.

Bandla Ganesh : సినీ పెద్ద‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చిన బండ్ల గ‌ణేశ్‌.. సీఎం రేవంత్ రెడ్డిని ప్ర‌స్తావిస్తూ..

1980-90ల్లో బ్యాంకింగ్ సెక్టార్ నేప‌థ్యంలో దీనిని తీర్చిదిద్దారు. భాస్క‌ర్ అనే ఓ స‌గ‌టు మ‌ధ్య‌త‌ర‌గ‌తికి చెందిన ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి.. కుటుంబ బాధ్య‌త‌ల‌ను నెర‌వేర్చ‌డం కోసం ఎలాంటి రిస్క్ చేశాడ‌నే క‌థాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు.

సాయి కుమార్, స‌చిన్ ఖేడేక‌ర్ లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు నిర్మించారు. ఇక సినిమా విడుద‌లైన 9 రోజుల్లో 77.2 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు సాధించిన‌ట్లు చిత్ర బృందం తెలిపింది.

Dhanush : అమ‌ర‌న్ డైరెక్ట‌ర్‌కి అద‌రిపోయే ఛాన్స్ ఇచ్చిన ధ‌నుష్‌