MAA Elections: కుర్చీ మీద మీకెందుకు అంత మమకారం: కరాటే కళ్యాణి
టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు గరంగరంగా సాగుతూ ట్విస్టుల మీద ట్విస్టులు తీసుకుంటున్నాయి. శుక్రవారం ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులను పరిచయం చేస్తూ మీడియా సమావేశం పెట్టి తన అభిప్రాయాలతో పాటు ఎన్నికలపై కూడా మాట్లాడారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ వ్యాఖ్యలపై ప్రస్తుతం మా అధ్యక్షుడు నరేష్, ప్యానల్ తీవ్రంగా వ్యతిరేకించారు.

Maa Member Karate Kalyani Comments On Prakash Raj
MAA Elections: టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు గరంగరంగా సాగుతూ ట్విస్టుల మీద ట్విస్టులు తీసుకుంటున్నాయి. శుక్రవారం ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులను పరిచయం చేస్తూ మీడియా సమావేశం పెట్టి తన అభిప్రాయాలతో పాటు ఎన్నికలపై కూడా మాట్లాడారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ వ్యాఖ్యలపై ప్రస్తుతం మా అధ్యక్షుడు నరేష్, ప్యానల్ తీవ్రంగా వ్యతిరేకించారు. వారికి వారే ప్యానల్ ప్రకటించుకొని రాజకీయ పార్టీ కాదంటూనే రాజకీయాలు చేస్తున్నారనే వ్యాఖ్యలు చేశారు. మా మసక బారిందనే నాగబాబు వ్యాఖ్యలను నరేష్ తీవ్రంగా తప్పుబట్టారు.
ఇక కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. కుర్చీ మీద ఎందుకు మీకు అంత మమకారం అని ప్రశ్నించారు. పనిచేసే వాళ్లని చెయ్యలేదు అంటే చాలా భాధగా ఉంటుందని.. రేపు మేము ఏమి చేస్తామో మీరే చూసి మాట్లాడాలని చెప్పారు. మేము మద్రాస్ వెళ్లి అక్కడ కుర్చీ ఇమ్మంటే ఇస్తారా అని ప్రశ్నించారు. ‘మా’ కుర్చీలో కూర్చోవాలి అనుకున్న వారు ముందు సర్వీస్ మోటోతో రావాలని.. మేము రాత్రి పగలు ‘మా’ కోసం కష్ట్టపడితే ఏమీ చేయలేదని మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. మహిళకు అవకాశం ఇస్తే మేము తప్పక సపోర్ట్ చేస్తామన్నారు.
ఇక, ప్యానల్ మరో సభ్యుడు నటుడు శివబాలాజీ మాట్లాడుతూ.. నేను ‘మా’లో పనిచేయాలని వెళ్తే ముందు అక్కడ నేను తెలుసుకుంది గొడవలేనని.. కానీ ఎవరి మాట వినకుండా మేము చేయాలనుకున్నది చేశామన్నారు. మేము ఇంత చేసినా ‘మా’లో ఏమి జరగలేదు అంటే మాకు చాలా భాధగా ఉందన్న శివబాలాజీ మాకు ఇంకా రెండు నెలలు ఉందని.. ఈ కాలంలో మేము చేయాల్సినవి ఎన్నో ఉన్నాయన్నారు. తదుపరి ‘మా’ పదవి ఎవరిదైనా కావచ్చు కానీ ఎవరైనా సర్వీస్ చేయాలనే ఉద్దేశ్యంతో మాత్రమే రావాలన్నారు.