Maa Oori Cinema : అక్టోబర్ 12న ‘మా ఊరి సిన్మా’
పులివెందుల మహేష్, ప్రియ పాల్ జంటగా నటించిన చిత్రం మా ఊరి సిన్మా. శివరాం తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీ మంజునాథ సినిమాస్ పతాంపై జి.మంజునాధ్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు.

Maa Oori Cinema Release date
Maa Oori Cinema Release date : పులివెందుల మహేష్, ప్రియ పాల్ జంటగా నటించిన చిత్రం ‘మా ఊరి సిన్మా’. శివరాం తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీ మంజునాథ సినిమాస్ పతాంపై జి.మంజునాధ్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ రూపుదిద్దుకున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అక్టోబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జి.మంజునాథ రెడ్డి మాట్లాడుతూ.. మా చిత్రంలోని పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయని, ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ చిత్రం అద్భుతంగా వచ్చిందని, సినిమా చూసిన కొంత మంది పెద్దలు బాగుందని మెచ్చుకుంటుంటే సంతోషంగా ఉందన్నారు. ఇది సమిష్టి విజయన్నారు. ప్రేక్షకులకు కూడా ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
దర్శకుడు శివరాం తేజ మాట్లాడుతూ.. ఇదొక ఊరిలో జరిగే ఇన్స్పైరబుల్ సబ్జెక్ట్ అని అన్నారు. సినిమా కోసం టీమ్ చాలా కష్ట పడిందన్నారు. వాళ్లు పడిన కష్టం నేడు స్క్రీన్ మీద కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. అలాగే తనను నమ్మి ఈ సినిమా నిర్మించిన మంజునాథ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.