Mr Idiot : రవితేజ తమ్ముడు కొడుకు మాధవ్ హీరోగా ‘మిస్టర్ ఇడియట్’ సినిమా నుంచి కావాలయ్యా.. సాంగ్ రిలీజ్..
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా వస్తున్న 'మిస్టర్ ఇడియట్' సినిమా నుంచి తాజాగా 'కావాలయ్యా..' అనే సాంగ్ రిలీజ్ చేశారు.

Madhav Mister Idiot Movie kavalayya Song Released sing by Mangli
Mr Idiot : మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా వస్తున్న సంగతి తెలిసిందే. మాధవ్, సిమ్రాన్ శర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘మిస్టర్ ఇడియట్’. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్ పీ బ్యానర్ పై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత JJR రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందD సినిమా డైరెక్టర్ గౌరీ రోణంకి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Appudo Ippudo Eppudo : నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ట్రైలర్ వచ్చేసింది..
ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, ట్రైలర్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా మరో పాటను విడుదల చేసారు. ‘మిస్టర్ ఇడియట్’ సినిమా నుంచి ‘కావాలయ్యా..’ అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ పాట రిలీజ్ చేస్తూ తమన్.. ‘కావాలయ్యా..’ సాంగ్ కంపోజిషన్, పిక్చరైజేషన్ బాగుంది అని చెప్పి మూవీ టీమ్ కు అల్ ది బెస్ట్ చెప్పారు.
ఇక ఈ పాటను భాస్కరభట్ల రాయగా అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వంలో మంగ్లీ ఫుల్ ఎనర్జిటిక్ గా పాడింది. ఈ పాట వింటుంటే హీరోయిన్ హీరోని నువ్వు నాకు కావాలయ్యా.. అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఉంది. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..
Good luck Dearest #Maadhav @maadhav_9999 💥❤️
Happy to launch this #Kavalayya song from dearest @maadhav_9999’s #MrIdiot 🎶🎹
Hope you have a great debut on the big screens! 🤗
– https://t.co/R7k3hk8dSb#GowriRonanki #simransharma @raamdop @anuprubens @saregamasouth…
— thaman S (@MusicThaman) November 4, 2024