ది జోయా ఫ్యాక్టర్ : ‘మహేరూ’ వీడియో సాంగ్

దుల్కర్ సల్మాన్, సోనమ్ కపూర్ జంటగా.. నటిస్తున్న 'ది జోయా ఫ్యాక్టర్' మూవీ నుండి 'మహేరూ' వీడియో సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : September 18, 2019 / 10:34 AM IST
ది జోయా ఫ్యాక్టర్ : ‘మహేరూ’ వీడియో సాంగ్

Updated On : September 18, 2019 / 10:34 AM IST

దుల్కర్ సల్మాన్, సోనమ్ కపూర్ జంటగా.. నటిస్తున్న ‘ది జోయా ఫ్యాక్టర్’ మూవీ నుండి ‘మహేరూ’ వీడియో సాంగ్ రిలీజ్..

దుల్కర్ సల్మాన్, సోనమ్ కపూర్ జంటగా.. నటిస్తున్న మూవీ.. ‘ది జోయా ఫ్యాక్టర్’.. అభిషేక్ శర్మ దర్శకత్వంలో, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, యాడ్-ల్యాబ్స్ ఫిలింస్ లిమిటెడ్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అనూజ చౌహాన్ రాసిన ‘ది జోయా ఫ్యాక్టర్’ నవల ఆధారంగా క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతుంది.

ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా జోయా ఫ్యాక్టర్ నుండి ‘మహేరూ’ అనే వీడియో సాంగ్ విడుదలయ్యింది. శంకర్ – ఎహషాన్ – లాయ్ కంపోజ్ చేసిన ట్యూన్‌కు, అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ రాయగా.. యజీర్ దేశాయ్ చాలా బాగా పాడాడు.

దుల్కర్, సోనమ్‌ల కెమిస్ట్రీతో పాటు, మనోజ్ లోబో విజువల్స్ కూడా బాగున్నాయి. సంజయ్ కపూర్, అంగద్ బేడి, సౌరభ్ శుక్లా తదితరులు నటించిన ‘ది జోయా ఫ్యాక్టర్’ త్వరలో విడుదల కానుంది.